Sunday, November 24, 2024
HomeLIFESTYLEHealthSonti Health Benefits in Telugu | Dry Ginger Health Benefits in Telugu

Sonti Health Benefits in Telugu | Dry Ginger Health Benefits in Telugu

Sonti:-

ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాల లో అల్లం ఒకటి. ఇది బయోయాక్టివ్, పోషకాల సమ్మేళనాల తో నిండి ఉంటుంది. ఇవి మన శరీరానికి, మెదడు కి చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శొంఠి చూర్ణాన్ని అనేక ఆయుర్వేద సూత్రీకరణ లలో ఒక మూల వస్తువుగా ఉపయోగిస్తారు.

అల్లం ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ప్రతి సంవత్సరం వేరు దుంప నుండి కొత్త శాఖలు వస్తాయి. ఆకులు పసుపు ఆకు ని పోలి ఉంటాయి. దీని పువ్వులు పసుపు రంగు లో ఒక రేక మాత్రం ఎరుపు రంగు లో ఉంటుంది.

అల్లాన్ని ఆంధ్ర దేశమంతా రైతులు వార్షిక పంట గా సాగు చేస్తున్నారు. ఈ అల్లము ని పైన తొక్క తీసి సున్నపు తేట లో ముంచి ఎండ బెడితే శొంఠి అవుతుంది.

Sonti Health Benefits in Telugu:-

రెండు చెంచాలు అల్లపు రసము నందు ఒక చెంచా తేనె కలిపి త్రాగితే దద్దుర్లు శమిస్తాయి. తరచూ జలుబు చేసి తుమ్ములు వస్తే శొంఠి రసం తాగితే త్వరగా తగ్గుతుంది. భోజనానికి ముందు నాలుగు నుండి ఆరు చిన్న అల్లం ముక్క లను ఉప్పు తో కలిపి తీసుకుంటే అన్నం బాగా జీర్ణం అవుతుంది. అల్లం రసం లో బెల్లం కలిపి తీసుకుంటే విరోచనం సాఫీగా అయి మలబద్దకం తగ్గుతుంది.

శొంఠి ని పాత బెల్లం, నీటి తో కలిపి ముద్ద గా నూరి తీసుకుంటే ఆకలి పెరిగి కామెర్లు తగ్గుతాయి. ఒక చెంచా శొంఠి పొడి, ఒక చెంచా నల్ల నువ్వుల పొడి తేనెతో కలిపి తీసుకుంటే నడుము, తొడలు, మోకాలు నొప్పి తొందరగా తగ్గుతుంది.

కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది:-

  • శొంఠి మొత్తం కొలెస్ట్రాల్, ట్రీగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుందని శాస్త్రీయ పరిశోధన లలో నిరూపించ బడింది.
  • 45 రోజుల పాటు ప్రతి రోజు 3 గ్రాముల శొంఠి ని తీసుకుంటే కొలెస్ట్రాల్ గణనీయం గా తగ్గుతుందని ఒక అధ్యయనం లో రుజువైంది.

అజీర్ణం:-

  • శొంఠి దీర్ఘ కాలిక అజీర్ణం వలన కడుపు లో నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
  • కడుపు ఖాళీ చేయడం లో ఆలస్యం, జీర్ణం కాని ఆహారం అనేవి అజీర్ణానికి కారణాలు.
  • భోజనానికి ముందు 1 నుండి 2 గ్రాముల శొంఠి పొడి ని తీసుకుంటే 50% కడుపు ని ఖాళీ చేయడాన్ని వేగవంతం చేయడం లో సహాయపడుతుందని నిరూపించ బడింది.

జలుబు:-

  • శొంఠి లో యాంటీ ఇన్ఫలమేటరీ జింజరోల్స్, షోగల్స్ ఉన్నాయి.
  • ఇవి సాధారణ జలుబు నుండి ఉపశమనం పొందటానికి సహాయ పడతాయి.
  • గోరు వెచ్చని నీటి తో శొంఠి పొడి కలిపి తీసుకుంటే జలుబు, ఫ్లూ, ముక్కు దిబ్బడ త్వరగా తగ్గుతాయి.
  • జలుబు నివారణ కోసం శొంఠి పొడి, లవంగం పొడి మరియు ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కండరాల నొప్పి:-

  • 11 రోజుల పాటు ప్రతి రోజు 2 గ్రాముల అల్లం తీసుకుంటే కండరాల నొప్పి గణనీయం గా తగ్గుతుంది.

రుతుక్రమం నొప్పి:-

  • మొదటి మూడు రోజులు ప్రతి రోజు ఒక గ్రాము శొంఠి పొడి ని తీసుకుంటే ఋతుస్రావపు నొప్పులు గణనీయం గా తగ్గుతాయి.

వికారం:-

  • గర్భిణీ స్త్రీలలో కొంత మందికి ఉదయాన్నే వాంతి వికారం ఉంటుంది.
  • అలంటి వారు అర టీస్పూన్ అల్లం పొడి , తేనె  గోరు వెచ్చని నీటి తో కలిపి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

బరువు తగ్గడం:-

  • శొంఠి కొవ్వు ని కరిగించుట లో సహాయ పడే ధర్మోజెనిక్ ఏజెంట్లు ఉంటాయి.
  • కనుక ఇది జీర్ణ క్రియ ని మెరుగు పరచి బరువు తగ్గించుట లో సహాయ పడుతుంది.
  • శొంఠి శరీరం లో నిల్వ చేసిన కొవ్వు కరగ టానికి మరియు రక్తం లో గ్లూకోజ్ ని వేగం గ ప్రాసెస్ చేయటానికి సహాయ పడుతుంది.
  • అల్లం ఆకలి మరియు అతిగా తినటాన్ని అరికడుతుంది.

రక్తం లో చక్కెర:-

  • అధిక రక్త చక్కర తో బాధ పడేవారు 2 గ్రాముల శొంఠి పొడి ని గోరు వెచ్చని నీటి లో ఉప్పు తో కలిపి తీసుకుంటే మంచిది.
  • ఉదయాన్నే ఖాళీ కడుపు తో తీసుకుంటే ప్రభావవంతం గా ఉంటుంది.

మంట :-

  • శొంఠి పొడి ని కొద్దిగా ఉప్పు తో కలిపి తీసుకుంటే శరీరం లో మంట  తగ్గుతుంది.
  • ఇది గాయాల వల్ల కలిగే మంట కి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.

జీవక్రియ:-

  • క్రమం తప్పకుండా  శొంఠి పొడి ని తీసుకుంటే జీవక్రియ మెరుగు పడుతుంది.
  • మెరుగైన మెటబాలిజం రేటు పొందటానికి అల్లం రోజు వారీ ఆహరం లో తీసుకుంటే మంచిది.
Post Disclaimer

The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.

The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.

RELATED ARTICLES

Most Popular