ప్రెడిక్టివ్ పోలిసింగ్ అనేది నూతన విజ్ఞాన పరిజ్ఞానానికి ఉపయోగించే ఒక పద్ధతి. ఈ AI News in Policing ప్రత్యేకించి, నేరాలు జరగడానికంటే ముందే ఒక చట్టాన్ని అమలు చేసే ఏజన్సీ లకు సహాయం చేస్తుంది. నేరాలు జరిగిన తరువాత స్పందించడాని కంటే, నేరాలు ఎక్కడ జరిగే అవకాశం ఉందో గుర్తించి అక్కడ నిరోధించడానికి, చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. AI అనేది పెద్ద మొత్తం లో డేటా ని విశ్లేషించి, నమూనాలను గుర్తించి పోలీసులకి సహాయం చేయడం లో కీలక పాత్ర వహిస్తుంది.
AI News in Policing: Law Enforcement in Telugu
Table of Contents
The Role of AI in Law Enforcement
AI లో ఉన్న మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, డేటా అనలైటిక్స్ టెక్నాలజీస్ నేర నివేదికలు, సోషల్ మీడియా, సీసీ ఫుటేజ్, పబ్లిక్ రికార్డు వంటి వాటి నుండి డేటా ను సేకరించి విశ్లేషించడానికి, చట్ట అమలు ఏజన్సీలను అనుమతిస్తుంది. ఈ డేటా ని ప్రాసెస్ చేయడం ద్వారా AI news in policing ప్రత్యేకించి నేరస్తుల కార్యకలాపాలు అంచనా వేసి పోలీసులను సమర్ధవంతంగా ప్రతిస్పందించడానికి అనుమతిస్తుంది.
Benefits of AI News in Policing in Telugu
నేర నివారణ
నేరాలు ఎక్కడైతే ఎక్కువ గా జరుగుతూ ఉంటాయో అంచనా వేయడం వలన, పోలీసులు ఆ ప్రాంతాలకు అధికారులను పంపించి నేరం జరగక ముందే నిరోధించ వచ్చు. ఈ ప్రాయాక్టీవ్ విధానం వలన మొత్తం నేరాల రేటు ను తగ్గించడానికి సహాయ పడుతుంది.
ఏజన్సీల కేటాయింపు
చట్టాన్ని అమలు చేసే ఏజన్సీలు తమ పరిమిత వనరులను ఎక్కడ కేటాయించాలి అనే దాని పైన మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయ పడుతుంది. అవసరం లేని దగ్గర ఎక్కువ పోలీసులను కేటాయించకుండా పోలీసులను ఎక్కువ ప్రమాద ప్రాంతాల లో కేటాయించడానికి సహాయపడుతుంది.
డేటా ఆధారిత నిర్ణయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ డేటా తో అధికారులు వ్రాత పని పై తక్కువ సమయం కేటాయించడానికి, ఎక్కువ పోలీసింగ్ పై సమయం పెట్టడానికి సహాయ పడుతుంది. పోలీసులు త్వరగా సమర్ధవంతం గా స్పందించడానికి, ఇది అత్యవసర సమయాల్లో బాగా ఉపయోగపడుతుంది.
వీటి వలన పోలీసులకు, ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడి , ప్రజల్లో విశ్వాసం పెంచడానికి కీలక పాత్ర వహిస్తుంది.
Challenges
పోలీసింగ్ లో AI అనేక ప్రయాజనాలు అందిస్తున్నప్పటికీ, అనేక సవాళ్లు మరియు ఆందోళన ని కూడా కల్పిస్తుంది.
- AI అనేది చారిత్రక డేటా ని రీడ్ చేసి దాని నుండి ప్రెడిక్ట్ చేస్తుంది కనుక ఒకవేళ పాత డేటా లో ఏమైనా తప్పులు ఉంటే అది ఇపుడు అనాలిసిస్ తప్పుగా చేస్తుంది. దాని వలన ఒక్కో ప్రాంతం లో అంతక ముందు నేరాలు జరగక పోయిన ఇపుడు జరిగే అవకాశం ఉన్నపుడు పోలీస్ పాట్రోలింగ్ తక్కువ ఉండుట వలన నేరం జరగొచ్చు.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరచుగా వ్యక్తి గత డేటాని సేకరించి విశ్లేషణ చేసే అవకాశం ఉంది. దీని వలన చట్ట అమలు పై నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది.
- AI సిస్టమ్స్ అర్ధం చేసుకోవడం క్లిష్టం గా ఉంటుంది. ఒకవేళ ప్రెడిక్షన్ రాంగ్ గా చేసి తప్పుడు అరెస్ట్ కి దారితీస్తే లేదా నేరాన్ని నిరోధించడంలో విఫలం అయితే, ఎవరిని బాధ్యులు గా గుర్తించడం సవాలుగా మారుతుంది.
- చట్టాన్ని అమలు చేసే సంస్థలు టెక్నాలజీ పై అతిగా ఆధారపడే ప్రమాదం ఉంది, దాని వలన దోషులు తప్పించుకునే అవకాశం ఉంది.
Examples of AI in Policing in Telugu
చట్టాన్ని అమలు చేసే సంస్థలు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం మొదలు పెట్టారు , ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి.
ప్రెడ్ పాల్
అత్యంత ప్రసిద్ధి చెందిన పోలీసింగ్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ లో ఇది ఒకటి. నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి ఇది చారిత్రిక క్రైమ్ డేటా ను ఉపయోగిస్తుంది. ప్రెడ్ పాల్ ని ఉపయోగించే పోలీస్ విభాగాలు ఈ ప్రాంతాలకు అధికారులను పంపించవచ్చు. నేరం జరగకముందే నిరోధించే లక్ష్యం తో పని చేస్తుంది.
హంచ్ ల్యాబ్
ఈ సాఫ్ట్ వేర్ ని Azavea కంపెనీ డెవలప్ చేసింది, ఇది చారిత్రక క్రైం డేటా, ఎకనామిక్ డేటా, మరియు ఇతర క్రైం ప్యాటర్న్స్ ఉపయోగిస్తుంది. ఇది పాత సంఘటలను మాత్రమే కాకుండా అవి సంభవించే సమయాన్ని, సందర్భాన్ని పరిగణలోకి తీసుకొని నేర ధోరణుల గురించి మరింత అవగాహన ని అందించడం లక్ష్యం గా పెట్టుకుంది.
షాట్ స్పాటర్
ఇది తుపాకి కాల్పులను గుర్తించి, చట్ట అమలు సంస్థలకు తెలియజేయడానికి శబ్ద సెన్సార్ లను ఉపయోగిస్తుంది. తుపాకీ కాల్పులు ఎక్కడ జరుగుతాయో వెంటనే సమాచారం అందించడం వలన త్వరగా స్పందించి నేరాన్ని నిరోధించగలరు. షాట్ స్పాటర్ అనేది AI పరిస్థితుల పై అవగాహన ని ఎలా మెరుగుపరుస్తుంది అనేదానికి ఒక మంచి ఉదాహరణ.
వివిధ నగరాల్లో డేటా ఆధారిత విధానాలు
చికాగో, లాస్ ఏంజెల్స్ అనేక నగరాలూ AI ని ఉపయోగించి డేటా ఆధారిత పోలీసింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసాయి. ఈ ప్రోగ్రామ్స్ క్రైం హాట్స్పాట్ లను గుర్తించి పోలీసింగ్ వ్యూహాలను తెలియజేయడానికి వివిధ డేటా లను విశ్లేషిస్తాయి.
The Future of AI in Policing
- డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుట వలన కచ్చితమైన అల్గారిథమ్స్ ఆశించవచ్చు. శాస్త్రవేత్తలు నిరంతరం పని చేయుట వలన మెరుగైన చట్ట అమలు కార్యక్రమాలను అభివృద్ధి చేయవచ్చు.
Post Disclaimer
The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.
The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.