Sunday, November 24, 2024
HomeLIFESTYLEHealthBilla Ganneru Health Benefits in Telugu | Catharanthus Uses in Telugu

Billa Ganneru Health Benefits in Telugu | Catharanthus Uses in Telugu

మొక్కలు మానవుల కి అత్యంత ముఖ్యమైనవి అవి అందించే ప్రయోజనాలు గుర్తించ లేనివి. మనకు ప్రమాదాలను కలిగించే అనేక వ్యాధులను పరిష్కరించ డానికి చాల ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఔషధ మొక్కల లో Billa Ganneru ఒకటి.

Billa Ganneru Properties లక్షణాలు:-

  • Billa Ganneru  అనేది సతతహరిత మరియు గుల్మాకాండ మొక్క.
  • ఇది అఫాసినేసి అనే కుటుంబానికి చెందినది మరియు ఆల్కలాయిడ్స్ కోసంఎం ఎక్కువగా పెరుగుతుంది.
  • ఈ మొక్క సుమారు ఒక మీటర్ పొడవు వరకు ఎత్తు పెరుగుతుంది.
  • అయితే దీని ఆకులు దీర్ఘ చతురస్ర ఆకారంలో 2.5 నుండి 9 సెంటీ మీటర్ల పొడవు, ఒకటి నుండి 3.5 సెంటీ మీటర్ల వెడల్పు మధ్య పెరుగుతాయి.
  • బిళ్ళ గన్నేరు పువ్వులు తెల్లటి రంగులో పసుపు మధ్య బిందువు మరియు 2.5 నుండి 3 సెంటీ మీటర్ల పొడవు ఉండే బేసల్ ట్యూబ్ తో ఉంటాయి.
  • ఈ మొక్క ఇసుక నేలల్లో, గడ్డి భూములు, అడవులు, గార్డెనింగ్ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది.
  • ఇది మడగాస్కర్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, మరియు భారత దేశం వంటి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది.
  • దీనిని ఇక్కడ అలంకార, ఔషధ, వాణిజ్య ప్రయోజనాల కోసం ఎక్కువగా పండిస్తారు.
  • ఈ బిళ్ళ గన్నేరు లో 8 జాతులు ఉన్నాయి. అయితే వాటిలో ఏడు మడగాస్కర్ కి చెందినవి.
  • ఒక జాతి మాత్రమే భారత దేశానికి చెందినది.
  • ఈ బిళ్ళ గన్నేరు లో 400 కంటే ఎక్కువ ఆల్కలాయిడ్లు ఉన్నాయి.

Billa Ganneru Health Benefits:-

యాంటీ డయాబెటిక్:-

  • బిళ్ళ గన్నేరు ఆకులు డయాబెటిస్ కి సహజ ఔషధం గా పని చేస్తాయి.
  • దీని ఆకులు మరియు పువ్వులు రక్తం లో చక్కర స్థాయి లను నియంత్రించ డానికి ఉపయోగిస్తారు.
  • బిళ్ళ గన్నేరు ఆకులు, పువ్వుల నుండి హెర్బల్ టీ ని తయారు చేస్తారు.
  • వీటిని ఉదయం తినవచ్చు లేదా 3 లేదా 4 ఆకుల ను నమలవచ్చు.

యాంటీ ట్యూమర్:-

  • బిళ్ళ గన్నేరు యొక్క ఆకులు మరియు కాండాల లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.
  • ఇవే కాకుండా కణితి నిరోధక లక్షణాలు కలిగిన ఆల్కలాయిడ్లు ఉన్నాయి.

గాయాల కు చికిత్స:-

  • బిళ్ళ గన్నేరు ఆకుల లో ఉండే ఆల్కలాయిడ్స్ గాయాలు నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • ఈ ఆకులు మరియు పసుపు కలిపి నూరి పేస్ట్ ని 2 నుండి 3 సార్లు రాస్తే గాయాలు నయం అవుతాయి.

రక్త పోటు:-

  • బిళ్ళ గన్నేరు ఆకులు రక్త పోటు చికిత్స లో ఉపయోగ పడతాయి.
  • దీని ఆకుల రసం ఉదయాన్నే 2 నుండి 3 మి.లీ. తీసుకుంటే రక్త పోటు నియంత్రించ డానికి సహాయ పడుతుంది.

చర్మ గాయాలు:-

  • బిళ్ళ గన్నేరు ఆకులు మరియు పసుపు బెండుల ను సమాన సమాన పరిమాణం లో తీసుకొని పేస్ట్ తయారు చేయాలి.
  • దీనిని మచ్చల పై బాహ్యం గా, రెగ్యులర్ గా అప్లై చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.

నాసికా మరియు నోటి రక్త స్రావం:-

  • బిళ్ళ గన్నేరు పువ్వు యొక్క తాజా రసం నాసికా మరియు నోటి రక్త స్రావాని కి మంచి నివారణ గా పని చేస్తుంది.
  • దీని పువ్వులు దానిమ్మ మొగ్గల తో కలిపి తీసుకుంటే నాసికా మరియు నోటి రక్త స్రావాన్ని ఉపశమనం చేస్తుంది.
  • ఈ రసాన్ని నోటిలో ఉంచితే చిగుళ్ల నుండి రక్తం కారడం, నోటి పూతల మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

క్రమ రహిత రుతు స్రావం:-

  • ఈ బిళ్ళ గన్నేరు ఆకుల కషాయాన్ని క్రమ రహిత రుతు స్రావం చికిత్స కి ఉపయోగిస్తారు.
  • రోజు 6 నుండి 8 తాజా ఆకులను 2 కప్పుల నీటితో ఉడికించి కషాయాన్ని తీసుకోవాలి.
  • ఇలా తీసుకోవడం వలన భారీ రుతు ప్రవాహం అలాగే తక్కువ ప్రవాహాన్ని క్రమబద్దీకరించ డానికి  ఉపయోగకరం గా ఉంటుంది.

లుకేమియా:-

  • బిళ్ళ గన్నేరు ని లుకేమియా, హాడ్కిన్స్ లింఫోమా చికిత్స లో ఉపయోగిస్తారు.
  • దీని ఆకులు మరియు కాండాలు యాంటీ ట్యూమర్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి  ఆల్కలాయిడ్ ల సమూహం.

ఇతర ఉపయోగాలు:-

  • కందిరీగ కుట్టినప్పుడు ఉపశమనం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది విషాన్ని తొలగించే మరియు విషాన్ని ఎదుర్కునే గుణాన్ని కలిగి ఉంది.
  • బిళ్ళ గన్నేరు లో ఉండే ఆల్కలాయిడ్లు మెదడు కి రక్త సరఫరా ని మెరుగు పరచడానికి సహాయ పడుతుంది.
  • పొట్టలో పుండ్లు, విరోచనాలకి చికిత్స చేయడానికి బిళ్ళ గన్నేరు ఉపయోగిస్తారు.

ముఖ్యమైన విషయాలు:-

  • బిళ్ళ గన్నేరు వేడిగా మరియు అనేక రసాయనాల తో ఉంటుంది కాబట్టి  ఎక్కువ కాలం ఉపయోగించ రాదు.
  • యాసిడ్ పెప్టిక్ రుగ్మతలకు కారణం కావచ్చు కాబట్టి గర్భిణీ  స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు ఈ బిళ్ళ గన్నేరు వాడరాదు.

 

Post Disclaimer

The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.

The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.

RELATED ARTICLES

Most Popular