Kondapindi aaku Health Benefits in Telugu/కిడ్నీ లో రాళ్లను పిండి చేసే ఆకు

Kondapindi Aaku:-

హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన మొక్క గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన Kondapindi aaku. నీరు మరియు తేమ ఉన్న ప్రదేశంలో ఈ కొండపిండి ఆకు ఎక్కువగా పెరుగుతుంది.

కొండ పిండి ఆకు ని సంస్కృతం లో బద్ర లేదా పాషాణ భేది అంటారు. కొంత మంది దీనిని పిండి తొండ లేదా తెలగ పిండి కూర అంటారు. ఈ కొండ పిండి ఆకు పొలంలో ఎక్కువ గా పెరుగు తుంది.

తెలగ పిండి ఆకు సాధారణం గ ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లో కనిపిస్తుంది. తమిళ నాడు లో సంక్రాంతి పండుగ అపుడు ఈ మొక్క తో ఇంటిని అలంకరిస్తారు. ప్రస్తుత కాలంలో కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.  ఈ మొక్క కాండం మొత్తం గుంపులు గా కనిపించే తెల్లని పువ్వులతో మీరు ఈజీగా గుర్తించ గలరు.

కొండ పిండి ఆకు లక్షణాలు:-

తెలగ పిండి చెట్టు బహువార్షిక మొక్క. ఇది సుమారు 75 సెంటి మీటర్ ఎత్తు వరకు పెరుగు తుంది. కొండపిండి  ఆకులు గుండ్రంగా లేదా కోడి గుడ్డు ఆకారం లో కణుపు  కి ఒకటి చొప్పున వస్తు ఉంటాయి. దీని పూలు చిన్నవి గా తెల్లటి రంగు లో ఉంటాయి. పిండి తొండ ఆకు కషాయం రోజుకి రెండు సార్లు తీసుకుంటే మూత్రం లో రాళ్లు నిస్సంశయం గా కరిగి పోతాయి. ఈ  Kondapindi Aaku  కషాయం చేసే టపుడు ఒక స్పున్ ఉలవలు పొడి చేసి వేస్తే ఇంకా త్వరగా మంచి ఫలితం వస్తుంది.

తెలగ పిండి మొక్క లోని అన్ని భాగాల లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకు ని పశువులు, కోళ్లు కూడా చాలా ఇష్టంగా తింటాయి. జంతువుల కి తెలుసు ఏది మంచిదో కానీ మన మానవులం మాత్రం ఏది ఆరోగ్యానికి మంచిదో అది తినము. మనం ఈ కొండ పిండి ఆకు ని పప్పు గా, కూర గా, పచ్చడి గా చేసుకోవచ్చు.

కొండ పిండి ఆకు లో ఆల్కలాయిడ్స్, కెమ్ ఫెరోల్, పెర్సి నోసైడ్స్,  టానిక్ యాసిడ్, ఫ్లేవ నాయిడ్స్ వంటి రసాయనాలు ఉన్నాయి.

కొండ పిండి ఆకు ఆరోగ్య ప్రయోజనాలు:-

మీకు మూత్రం సాఫీ గా కాకపోతే నాలుగు లేదా ఐదు కొండ పిండి ఆకులు కడిగి నమలండి. ఈ ఆకు చేదు ఉండదు ఎవరైనా తినగలరు. ఇది తిన్న గంట లోపే మూత్రం ఈజీగా అవుతుంది. మానవులలో వ్యాధులు కలిగించే హ్యూరో న్యూమస్ న్యూట్రోఫిలా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వలన మనకు వ్యాధులు, జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా పెరుగు దల ని కొండ పిండి ఆకు అరి కడుతుంది. 2011 వ సంవత్సరం లో కొండ పిండి ఆకు పై జరిగిన పరిశోధన లలో ఇది వెలువడింది.

1. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:-

  • కొండ పిండి ఆకు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.

2. ఆస్తమా కి చికిత్స:-

  • తెలగ పిండి ఆకు సారం ఉబ్బసం చికిత్స కి ప్రభావ వంతంగా పని చేస్తుంది.
  • ఈ కొండ పిండి ఆకు ఆస్తమా నిరోధక లక్షణాలు కలిగి ఉంది అని నిరూపించ బడింది.

3.రక్తం లో చక్కర కంట్రోల్:-

  • తెలగ పిండి ఆకు రక్తం లో చక్కర స్థాయి లను నియంత్రిస్తుంది.
  • డయాబెటిక్ రోగులు అనుభవించే శరీర బరువు ని కూడా తగ్గడాన్ని నివారిస్తుంది.

4. డయేరియా కి చికిత్స:-

  • కొండ పిండి ఆకు నీటి కాషాయాలు విరోచనాలు కి చికిత్స  చేస్తారు.
  • ఈ తెలగ పిండి ఆకు పేగు రవాణా ని తగ్గించడం లో సహాయ పడింది.

5. పేగు పురుగులు వదిలించ టానికి:-

  • కొండ పిండి ఆకు యాంటిల్మిమటిక్ లక్షణాలు కలిగి ఉంది.
  • పేగు పురుగులు కి చికిత్స చేయడానికి కొండ పిండి ఆకు ఉపయోగిస్తారు.

6. క్యాన్సర్ నిరోధించటానికి:-

  • కొండ పిండి ఆకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంది.
  • తెలగ పిండి ఆకు పై  జరిగిన పరిశోధనలలో 100 mg  అన్ని క్యాన్సర్ కణ తంతువులకు వ్యతిరేకంగా నిరూపించ బడింది.

7. మూత్ర పిండాల రక్షణ:-

  • కొండ పిండి ఆకు అద్భుత మైన నెఫ్రాలజీ రక్షణ లక్షణాల ను కలిగి ఉంది.
  • తెలగ పిండి ఆకు ని తీసుకోవడం వలన రక్తపు యూరియా మరియు సీరం క్రియేటినిన్ లను తగ్గిస్తుంది.
  • దీని వలన మూత్ర పిండాల వ్యాధుల తో బాధ పడే వ్యక్తులకు ఇది మంచిది.
  • దీర్ఘ కాళిక వ్యాధులతో బాధ పడుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించి తర్వాత మాత్రమే కొండ పిండి ఆకు తీసుకోవడం మంచిది.

సైడ్ ఎఫెక్ట్స్:-

  • గర్భిణీ స్త్రీలు కొండ పిండి ఆకు తీసుకోకూడదు ఎందుకంటే ఇది గర్భ స్రావం చేసే లక్షణాలు కలిగి ఉంది.
  • గర్భం కోసం ప్రయత్నం చేసే వారు కూడా కొండ పిండి ఆకు తీసుకోకూడదు.
  • కొండ పిండి ఆకు వాడే వారు వైద్యుని సంప్రదించి వాడాలి.

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.