money earning tips in telugu

Money Earning Tips in Telugu in 2022

హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే ఉండే మహిళల కి, చదువుకునే విద్యార్థుల కి, ఇంకా ఖాళీగా ఉండే వారికి ఒక మంచి డబ్బు సంపాదించే ఆలోచన ని షేర్ చేస్తున్నాను.

ప్రస్తుతం అంతా డిజిటల్ హవా నడుస్తోంది. ఏది కావాలన్న అందరూ ఆన్లైన్ లొనే తెలుసుకుంటున్నారు. మరియు డిజిటల్ హవా వలన ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపాధి జరుగుతుంది. ప్రజలు వినోదం, విద్య, సమాచారం, ఆహార పదార్థాలు, బట్టలు, ఆహారం అన్ని సాంకేతిక పరికరాలు, డిజిటల్ పైనే ఆధార పడుతున్నారు. కనుక, నేను మీకు ఈరోజు ఈబుక్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలో షేర్ చేస్తున్నాను.

ఒక రచయిత గా ఏదయినా పుస్తకాన్ని ప్రచురించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

  • మీరు సొంతంగా ఒక ఈబుక్ తయారు చేసి డబ్బు సంపాదించడం.
  • ఎవరి తో అయినా కంటెంట్ తయారు చేయించి ఈబుక్ చేసి సంపాదించడం.

ముందుగా ఈబుక్ వలన ఉపయోగాలు ఏంటో చూద్దాం.

  • సులువుగా ప్రచురించవచ్చు:-

    రచయితలు వారి పుస్తకాలను పబ్లిష్ చేయడానికి వేరొకరి పై ఆధార పడే రోజులు పోయాయి. ఈబుక్ ని పబ్లిష్ చేయడం చాలా తేలిక. ఇది ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీ గా ఉంటుంది మరియు ఈజీగా బటన్ క్లిక్ తో చేయవచ్చు.

  • తక్కువ రేటు:-

    మీరు ఈబుక్ ని పబ్లిష్ చేయడానికి అమెజాన్ లో ఇంకా కొన్ని వెబ్సైట్లు లో ఫ్రీగా పబ్లిష్ చేయొచ్చు. కాకపోతే, కవర్ డిజైన్ మరియు కొన్ని ప్రొఫెషనల్ సేవలకు కొంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే చూడటానికి అందంగా ఉండేట్లు పుస్తకం పబ్లిష్ చేయడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఇది కేవలం మీ ఆప్షన్ మాత్రమే.

ఈబుక్ ఎందులో అమ్మాలి?

  • Ministry media
  • Kindle
  • Smash words
  • Scribd
  • Amazon
  • Social Media

ఎలా ఈబుక్ పబ్లిష్ చేయాలి?

ప్రారంభం దగ్గర నుండి ముగింపు వరకు ఎలా చేయాలో కింద వివరంగా ఇస్తున్నాను.
ఈబుక్ రాయడం:-
ముందుగా కొన్ని పుస్తకాలు చదివి, వారు ఎలా రాస్తున్నారు, ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. తరువాత ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ తెలుసుకొని రాయాలి. ఎవరిది కాపీ కొట్టకూడదు. ముందు ఒక రఫ్ కాపీ చేసి అంతా సరే అనుకున్న తరువాతే పబ్లిష్ చేయాలి.
మొదట గా మీకు తెలిసిన వాటిపై ఈబుక్ రాయండి. ఆకర్షణీయమైన అంశాలపై వివరంగా నమ్మకంగా రాయండి. మీరు పబ్లిష్ చేసిన తరువాత అయినా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేయవచ్చు.

ఇవి రెండు రకాలు:

  • ఫిక్షన్
  • నాన్ ఫిక్షన్

ఫిక్షన్:-
ఫిక్షన్ అంటే ఊహించి రాయడం. దీనికి ఉదాహరణలు కథలు, డ్రామా, హర్రర్ కథలు, సస్పెన్స్, పుస్తకాలు.
నాన్ ఫిక్షన్:-
నాన్ ఫిక్షన్ పుస్తకాలు అంటే బయోగ్రఫీ, టెక్స్ట్ బుక్స్, మొటివేషన్ పుస్తకాలు.

ఈబుక్ రాయడానికి కొన్ని దశలు:

  • ముందుగా టాపిక్ ఎంచుకోండి.
  • ఒక మ్యాప్ అంటే పుస్తక రూపు రేఖ తయారు చేసుకోండి.
  • రాయడానికి ఒక టైమ్ పెట్టుకోండి.
  • ఒక కవర్ డిజైన్ తయారు చేసుకోండి.
  • పుస్తకానికి కవర్ పేజ్ మరియు డిస్క్రిప్షన్ రాయడం చాలా ముఖ్యం.

 

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.