Stone Grinder Uses:-
హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు Stone Grinder Uses in Telugu | తిరగాలి లేదా సన్నికల్లు ఉపయోగాలు గురించి షేర్ చేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తినడానికి తయారు చేసిన ఏ ఆహార పదార్ధం అన్నం లేదా పప్పు లేదా చపాతీ ఏదయినా సరే తయారు చేసిన గంట లోపే తినాలి. ఎందుకంటే గంట తర్వాతా నుండి సమయం గడిచే కొద్దీ ఆహార పదార్ధం లోని పోషక విలువలు తగ్గిపోతు ఉంటాయి. పూర్తిగా పోషకాలు తగ్గినా ఆహార పదార్ధాలు ఎంత మాత్రం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
చపాతీ చేసే పిండి అయితే 15 రోజులలోపే అందులో పోషకాలు ఉంటాయి. జొన్నలు, రాగులు, సజ్జలు వంటి పిండితో అయితే ఏడు రోజులలోపే రొట్టెలు చేసుకోవాలి. అంతకు మించితే అందులో పోషకాలు ఉండవు. అయితే ఈ పిండి పదార్ధాలు అన్ని కూడా తిరగలి తో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మిక్సీలు, ముల్లులు, చేసే పదార్ధాలలో పోషకాలు ఉండవు. ఇంకా బయట కొనే ఆహార పదార్ధాలలో పోషకాలు ఉండవు. మరియు వారు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం రసాయన పదార్ధాలు కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
ఇపుడు ఉన్న ప్రపంచం లో ఎవరికీ వారు బిజీగా ఉంటున్నారు. ప్రతి దానికి ఎలక్ట్రిక్ మెషిన్లు వాడుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ మెషిన్ లో వాడే ఏ ఆహార పదార్ధం అయినా అందులో ఎంటువంటి పోషకాలు ఉండవు. అపుడు త్వరగా పోషక లోపాల వ్యాధులు వస్తాయి. ఒకప్పటి కాలం లో అందరు అన్ని ఎవరికీ వారు ఇంట్లోనే అన్ని ఆహార పదార్ధాలు తయారు చేసుకునేవారు. అందుకే మన పెద్దవాళ్ళు అంత ఆరోగ్యం గా ఉండేవారు.
Table of Contents
Stone Grinder Uses in Telugu | Tiragali | Sannikallu | తిరగలి లేదా సన్నికల్లు ఉపయోగాలు:-
నిజానికి తిరగాలితో పిండి పదార్ధకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు మన పెద్దవాళ్ళు అందించిన అద్భుతమైన పరికరం. తిరగలి తో తయారు చేసిన ఆహార పదార్ధాలు ఎప్పటికి అప్పుడు తాజాగా ఉంటుంది. తిరగలి తో పిండి తయారు చేసే వారి శరీర ఆరోగ్యం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతే కాదు, తిరగలి ఉపయోగించే మహిళలకు నడుం నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నెప్పులు, మోకాలి నెప్పులు ఇవేమి అంతగా ఉండవు.
ఇంకా బ్లెడ్ ప్రెజర్, డయాబెటిస్ వంటివి రానే రావు. ఇది శాస్త్రవేత్తల అధ్యాయనాల లో రుజువు అయింది. ఇంకా తిరగలి విశిష్టత ఏమిటంటే తిరగలి వాడేవారికి పొట్టమీద ఒత్తిడి పడుతుంది. కాళ్ళ మీద, చేతుల మీద, పొట్ట మీద ఒత్తిడి పడటం వలన డెలివరీ అపుడు ఆపరేషన్ చేసే అవసరం రాదు. మహిళలకు ఈజీగా సాధారణ కాన్పు అవుతుంది. సుఖ ప్రసవం జరిగి తల్లి, బిడ్డ, ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు.
ఎందుకంటే పొట్ట భాగం లోనే ఆడవారికి గర్భసంచి ఉంటుంది. కనుక పొట్ట పైన ఒత్తిడి పడటం వలన పొట్ట భాగం అంత సంకోచ వ్యాకోచాలు జరిగి సుఖ నార్మల్ డెలివరీ అవుతుంది.
అందుకే మన పెద్ద వారు ఆడవారు ఒక్కొక్కరు 6 నుండి పది మంది వరకు పిల్లలకు జన్మని ఇచ్చేవారు. అయినా కుడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదు. గర్భవతిగా ఉన్నపుడు ఆరు నెలలు వరకు కుడా తిరగలి ఉపయోగించవచ్చు. అప్పుడు వారికి నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివర్ అయినా పిల్లలు కూడా చాల ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారు. ఆపరేషన్ అయిన తల్లులు, పిల్ల్లలు కొంచెం అనారోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంది.
ఇంకా అధిక బరువు, ఒబేసిటీ తో ఇబ్బంది పడేవారు, బరువు తగ్గాలనుకునేవారు తిరగలి వాడితే ఈజీ గ బరువు తగ్గుతారు. పురుషులు అయినా, మహిళలు అయినా ప్రతి రోజు ఒక గంట తిరగలి తిప్పితే వెంటనే బరువు తగ్గుతారు.
Stone Grinder ఆడవారికి 40 ఏళ్ల తరువాత వచ్చే మోనోపాజ్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది.
Read More:-
Post Disclaimer
The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.
The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.