Refrigerator Side Effects In Telugu | ఫ్రిడ్జ్ గురించి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు

Refrigerator Dangerous Facts In Telugu

ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు. పేద వారి నుండి ధనికుల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వస్తువు ఉన్నది. కారణం ఫ్రిడ్జ్ లో పెడితే ఆహారం పాడవదు అనే భ్రమ లో అందరూ ఉన్నారు. కారం, చింత పండు దగ్గర నుండి ప్రతి ఒకటి ఫ్రిడ్జ్ లో పట్టకుండా ఉండే విధంగా అమరుస్తున్నారు. ఎందుకంటే రంగు చెడిపోదు అని ఏదొక కారణం చెప్తున్నారు. కాని మన ఇంట్లో ఉండే అతి భయంకరమైన విషపు వస్తువు ఇది అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఎందుకు విషపు వస్తువు (Refrigerator Dangerous Facts in Telugu) అనేది తెలుసుకోండి.

ఒకప్పటి కాలం లో ఇటువంటి ఎలెక్ట్రిక్ సాధనాలు ఏమి లేవు. అన్ని పనులు తమ సొంత చేతులతో ఎవరి పై ఆధార పడకుండా చేసుకునేవారు. అప్పటి తరం వారు వంద ఏళ్ళు కూడా ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి కరెంట్ తో పని చేసే వస్తువుల వలన సగం అనారోగ్యాలు వచ్చాయి.

How Refrigerator Dangerous in Telugu?

మనం తినే ఏ ఆహారం అయినా, గాలి, వెలుతురు తగిలిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. గాలి, వెలుతురు తగలని ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే గాలి, వెలుతురు తగలని ఆహారం విషం తో సమానం. ఈ విషం అనేది మన శరీరానికి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి వెంటనే పనిచేస్తుంది. మరొకటి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు తర్వాత ఏదొక వ్యాధి రూపంలో బయట పడుతుంది.

Refrigerator or Fridge or Freezer లో కూడా గాలి, సూర్యరశ్మి చేరదు. ఇందులో సహజంగా ప్రతి ఇంట్లో ఉండే ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత సహజంగా ప్రకృతి సహకారంతో జరిగితే ఎటువంటి ప్రమాదం వుండదు. కానీ అలా జరుగుతుందా? అలా లేదు. ఈ Refrigerator కరెంట్ మరియు ఎలక్ట్రిక్ సహాయంతో కొన్ని రకాల గ్యాస్ లను విడుదల చేసి ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రతలు తగ్గిస్తుంది.

ఈ గ్యాస్ లు పన్నెండు రకాల గ్యాస్లను విడుదల చేసేలా తయారు చేస్తారు. ఇవి ఏమిటంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ (C. F. C). అంటే వీటిలో క్లోరిన్, ఫ్లోరిన్, కార్బన్ డై ఆక్సయిడ్ ఉన్నాయి. ఇవి చాలా విష పదార్థాలు.

మనం గాలిని పీల్చి వదులుతాము. ఆ వదిలే గాలిని కార్బన్ డై ఆక్సయిడ్ అని అంటారు. ఈ కార్బన్ డై ఆక్సయిడ్ ని బయటకు వదలకుండా కాసేపు మనలో అలానే ఉంచుకుంటే కచ్చితంగా ఎవరైనా మరణిస్తారు. అంత కంటే భయంకరమైన విషాన్ని ఫ్రిడ్జ్ విడుదల చేస్తుంది.

ఇలాంటి విష వాయువులు పన్నెండు రకాలు విడుదల చేస్తుంది. ఇంక ఇది ఎంతటి ప్రమాదకరం అంటే… మనం refrigerator లో ఉంచే ప్రతి ఆహార పదార్ధాల పై ఈ విష ప్రభావం ఉంటుంది. మనం ఎంతటి డబ్బా లో పెట్టి గాలి పోకుండా మూతలు పెట్టిన వాటిని ఛేదించి మరి లోపాలి పదార్ధాల మీద ఈ విష వాయువులు వ్యాపిస్తాయి.

మరి ఇంతటి ప్రమాదకరమైన వస్తువు ని ఎందుకు తయారు చేశారు అని ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న మొదలవుతుంది. దీనికి ఒక కారణం ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇంకా చల్లని వాతావరణం ఉండే యూరోపియన్ దేశాల వారికి … కొన్ని రకాల అల్లోపతి మందులను కావలసిన ఉష్ణోగ్రత లో ఉంచుకోవడానికి ఈ ఫ్రిడ్జ్ ని తయారు చేసారు.

Notes:-

దీన్ని మొట్టమొదట మిలటరీ సైన్యం వద్ద వారి ఆరోగ్య సంరక్షణ కోసం వాడే మెడిసిన్ నిల్వ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. మన భారత దేశంలో ఈ Refrigerator అవసరం చాలా తక్కువ.

అంతే కానీ ఉప్పు, కారం, కూరగాయలు నిల్వ చేసుకోవడానికి కాదు. ఎక్కడైనా కొన్ని పదార్థాలు దొరకనివి నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అంతే కాని ప్రతి రోజు ఉపయోగించే పదార్థాలు నిల్వ చేసుకోవడానికి కానే కాదు.

Stone Grinder Uses in Telugu | తిరగలి లేదా సన్నికల్లు ఉపయోగాలు

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.