Ennenno Janmala Bandham serial Hero Niranjan Real Life in teluguEnnenno Janmala Bandham serial Hero Niranjan Real Life in telugu

స్టార్ మా లో ప్రసార మవుతున్న సరికొత్త ధారా వహిక ఎన్నెన్నో జన్మల బంధం. ఈ సీరియల్ ప్రతి రోజు రాత్రి 9:30 కి ప్రసారం అవుతుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్, మనసు పలికే మౌన గీతం సీరియల్ ని రీమేక్ చేశారు.

Ennenno Janmala Bandham serial Hero Niranjan Real Life in telugu:-

ఈ సీరియల్ లో హీరో గా నటిస్తున్న నటుడు నిరంజన్ గురించి ఈరోజు బ్లాగ్ లో షేర్ చేయ  బోతున్నాను. ఎన్నెన్నో జన్మల బంధం నాటిక లో నటిస్తున్న నిరంజన్ రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసు కుందాం.

ఇతని పూర్తి పేరు Niranjan BS. నిరంజన్ 1996 ఆగస్టు న బెంగళూర్ లో జన్మించాడు. తన చదువులు అంతా కూడా నిరంజన్ బెంగళూరు లోనే పూర్తి చేశాడు. హీరో నిరంజన్ బెంగళూరు లో పుట్టి పెరిగాడు. నిరంజన్ గారి అమ్మ గారు ఒక టీచర్. ఇతని తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవారు. నిరంజన్ జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది.

ఇతని కి చిన్న తనం నుండి ఇండియన్ ఆర్మీ లో జాయిన్ కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక తో స్కూల్, మరియు కాలేజ్ లో ఎనిమిది ఏళ్ల పాటు NCC శిక్షణ తీసు కున్నాడు. నిరంజన్ పలు స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రస్ట్ తో ఉండే వాడు.

దురదృష్ట వశాత్తు ఒక ప్రమాదం లో తన లిగిమెంట్ దెబ్బ తినడం తో తన కల, కలగానే మిగిలి పోయింది. తరువాత రేడియా జాకీ గా ఆ తర్వాత వీడియో జాకీ గా మారిపోయాడు.

నిరంజన్ కన్నడ సీరియల్స్ తో తన కెరీర్ మొదలు పెట్టాడు. గాంధారి అనే కన్నడ సీరియల్ లో బుల్లి తెర మీద రంగ ప్రవేశం చేసాడు.  ఆ తరువాత నందిని అనే సీరియల్ లో నటించాడు. నందిని కేవలం కన్నడ మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం, భాష లలో ప్రసారం అయ్యింది. నందిని సీరియల్ తో నిరంజన్ తెలుగు లో మంచి గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత నిరంజన్ మరొక తమిళ సిరియల్ లో నటించాడు. తరువాత రవళి అనే కన్నడ సీరియల్ లో రిషి అనే పాత్ర లో నటించి గుర్తింపు ని పొందాడు. ఈ సీరియల్ జీ కన్నడ లో ప్రసారం అయ్యింది.

తన కల ని నిజం చేసు కోలేక పోయిన నిరంజన్ ఒక మంచి నటుడు గా స్థిర పడ్డాడు. తరువాత నిరంజన్ చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. వాస్కోడి గామ అనే చిత్రం లో కూడా నిరంజన్ నటించాడు.

తర్వాత యష్ తో కలిసి మాస్టర్ పీస్ అనే చిత్రం లో కూడా కనిపించాడు. ఇపుడు తెలుగు లో ఎన్నెన్నో జన్మ ల బంధం అనే సీరియల్ తో తెలుగ్ ప్రేక్షకుల ను అలరిస్తున్నాడు.

నిరంజన్ కి తెలుగు చిత్ర పరిశ్రమ లో మంచి గుర్తింపు రావాలి అని కోరుకుందాం.

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.