Sleeping tips in telugusleeping tips in telugu | how to get sleep fastly

Sleeping Tips in Telugu | How to get Sleep Fastly in Telugu:-

నిద్ర కి తక్కువ సమయం కేటాయిస్తూ, ఎప్పుడూ పని చేసే వారికి ఒబేసిటీ అంటే స్థూల కాయం, రక్త పోటు, అధికంగా ఉంటుందని పలు పరిశోధన లలో వెల్లడైంది. ఇంకా గుండె జబ్బులు, పక్ష వాతం వచ్చే ఛాన్స్ లు అధికంగా ఉన్నాయి. పది వేల మంది కార్మికుల పై 17 ఏళ్ల పాటు చేసిన అధ్యాయనాలలో కొంత కాలం పాటు రోజు 7 గంటల నుంచి 5 గంటల కన్నా తక్కువ నిద్ర తగ్గితే గుండె జబ్బుల ముప్పు రెండు రెట్లు పెరిగిందని రుజువైంది. నేను ఈరోజు మీకు నిద్ర పట్టడానికి కొన్ని టిప్స్ (Sleeping tips in Telugu) షేర్ చేస్తున్నాను.
1960 సంవత్సర ప్రాంతాల్లో పరిశోధకులు రోజుకి కనీసం 9 గంటలైన నిద్ర పోవాలని చెప్పేవారు. ప్రస్తుత కాలంలో రోజుకి 7 గంటలు చాలు అని అంటున్నారు. నిద్ర సమయాలు తగ్గే కొంది ప్రపంచ వ్యాప్తంగా స్థూల కాయుల సంఖ్య పెరుగుతోంది.
తక్కువ నిద్ర పోయినప్పుడు లెప్టిన్ హార్మోన్లు 26 శాతం వరకు తగ్గడంతో వెయ్యి క్యాలరీలు దాకా ఆహారం అధికంగా తీసుకుంటున్నారు అని తేలింది. నిద్ర తక్కువ అయ్యే కొంది శరీరం క్యాలరీలు తక్కువయ్యాయని భావిస్తుంది అని పరిశోధకులు తెలిపారు.
సకాలం లో నిద్ర పోతే శరీరంలో అలసట తగ్గుతుంది. అలసట తగ్గడంతో చురుకుదనం, బలం, ఉత్సాహం, ఆకలి పెరుగుట వంటివి కలుగుతాయి. రాత్రి పూట నిద్ర జాగరణ చేస్తే కఫ, విష దోషాలు హరించబడతాయి. వాత దోషం పెరుగుతుంది. ఒక్క గ్రీష్మ కాలంలో తప్ప మిగిలిన కాలాల్లో పగటి పూట నిద్ర పోకూడదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మధ్యాహ్నం పూట నిద్ర పోతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక 90 నిమిషాలు మధ్యాహ్నం పూట నిద్ర పోతే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని పరిశోధనల్లో తెలినట్లు ప్రొఫెసర్ కర్ని హైఫా యూనివర్సిటీ కి చెందిన వ్యక్తి తెలిపారు.
పెద్ద వారిలో జ్ఞాపకశక్తి పెరగటానికి పగలు నిద్ర పోతే మంచిది అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కానీ పిల్లలు, యువకులు మాత్రం పగలు నిద్ర పోకూడదు ఎక్కువగా, ఎందుకంటే మంద బుద్ది వస్తుంది.
రాత్రి పూట జాగరణ చేసే వారిపై పరిశోధన చేస్తే 4.5 శాతం గుండె పోటు వచ్చే ముప్పు ఉంది.
నేటి సమాజంలో నిద్ర లేమితో బాధ పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. నిద్ర పట్టడానికి కొన్ని సూచనలు చూద్దాం.

Sleeping Tips in Telugu:-

  • రాత్రి పూట అరికాళ్ళ కి బాగా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. ఆ తరువాత వేడి నీరు ఉన్న బకెట్ లేదా టబ్ లో కొన్ని నిమిషాలు కాళ్ళు ఉంచి తీసి వేసి నిద్ర పోతే బాగా నిద్ర పడుతుంది.
  • రాత్రి పూట పడుకోవటానికి రెండు గంటల ముందుగానే ఆహారం తీసుకోవాలి. తినగానే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానితో జీవక్రియలు చురుగ్గా తయారవుతాయి. దాని వలన తిందరగా నిద్ర పట్టదు.
  • చింత ఎక్కువైతే నిద్ర పట్టదు అనే సామెత ఉంది. ప్రతి రోజు కొంచెం సేపు ధ్యానం, యోగం చేయాలి. దాని వలన మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ప్రతీ రోజు 5 నుండి6 తులసి ఆకులు నమిలి తినవలెను.
  • రాత్రి పడుకోవటానికి 45 నిమిషాల ముందు చక్కని లలిత సంగీతం వింటే 35 శాతం గాఢ నిద్ర పడుతుంది అని పరిశోధనల్లో వెల్లడైంది.
  • బరువు తగ్గితే నిద్ర తొందరగా పడుతుంది. ప్రతి రోజు 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకోవాలి.
  • నిద్ర పోవటానికి ముందు స్వీట్లు అసలు తినకూడదు. ఒక వేళ స్వీట్లు తింటే రక్తం లో చక్కెర నిల్వలు పెరిగి శరీరానికి మరింత శక్తి పెరిగి చురుకుదనం పెరుగుతుంది. దాని వలన నిద్ర తొందరగా పట్టదు.
  • నిద్ర పోవటానికి కనీస ఉష్ణోగ్రత 16 నుండి 18 సెంటి గ్రేడ్ ఉండాలి. ఇలా అని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రతి వారికి ఇది సాధ్యం కానే కాదు. కిటికీలు అన్నీ తెరచి గదిలో వేడి బయటకు వెళ్లేలా లోపలికి చల్ల గాలి ఉండేలా చూసుకోవాలి.
  • పీనల్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే మేలటోనిస్ అనే హార్మోన్ నిద్రని పెంచుతుంది. నిద్ర పోయే గంట ముందు అరటి పండ్లు లేదా వేరు శనగ గుళ్ళు, చికెన్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ ఆహార పదార్ధాల లో మేలటోనిస్ ని ప్రేరేపించే ట్రిప్ట్ ఫాన్ అనే రసాయనం ఉంటుంది. ఇవి నిద్ర పట్టడానికి సహాయ పడతాయి.

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.