Great Kitchen Tips in telugu in 2022

హలో ఫ్రెండ్స్, లక్ష్మీ క్రియేషన్స్ టీవీ కి స్వాగతం. ఈరోజు నేను మీకు కిచెన్ లో ఉపయోగపడే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ తో మనం పనులు చాలా ఈజీగా చేసుకోవచ్చు.

To Work Hot Box More Effectively:-

  • హాట్ బాక్స్ లో పెట్టినవి ఆరిపోకుండా ఉండాలి అంటే హాట్ బాక్స్ కి సరిపోయే ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి.
  • ఆహార పదార్థాలు పెట్టిన తరువాత ఆ స్టీల్ ప్లేట్ ని పెట్టండి.
  • ఆ తరువాత హాట్ బాక్స్ మూత పెట్టండి.
  • ఇలా చేయడం వలన హాట్ బాక్స్ మూత పైన ఉండే వాటర్ డ్రాప్స్ ఫుడ్ పైన పడవు.
  • మరియు ఆహారం పాడు అవ్వదు అండ్ ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది.
  • ఇలా ప్లేట్ పెడితే మాములు గా ఉండే వేడి కంటే ఇంకా ఎక్కువ వేడి గా ఉంటుంది.

Easy Fixing of Stones For Bangles, chains etc:-

  • గాజులు, క్లిప్స్ కి ఉండే స్టోన్స్ త్వరగా ఊడిపోతాయి.
  • అవి తిరిగి అతికించ టానికి ఫివికల్ కాని ఫెవికిక్ కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి.
  • ఇది అప్లై చేసిన తరువాత స్టోన్ వేసి అతికించవచ్చు.
  • ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ లేకపోతే కలర్ నెయిల్ పాలిష్ తో వేసి అంటించవచ్చు.

Get rid of bad odours from kitchen:-

  • మనం ఉల్లిపాయ, వెల్లుల్లి కట్ చేసిన అపుడు చేతులు వాసన వస్తూ ఉంటాయి.
  • హాండ్ వాష్ తో వాష్ చేసిన హా వాసన పోదు.
  • అటువంటి అపుడు ఇలాంటి వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం టూత్ పేస్ట్ తీసుకోండి.
  • తరువాత చెయ్యి కొంచెం తడి చేసి పేస్ట్ ని చేతుల తో బాగా రబ్ చేయాలి.
  • సబ్బు తో కంటే కూడా ఇలా టూత్ పేస్ట్ తో రబ్ చేస్తే వాసనలు శుభ్రం గా పోతాయి.

Easy Cleaning of Hair Combs:-

  • ఇంట్లో దువ్వెనలు శుభ్రంగా లేకపోతే చాలా సేపు రుద్ది కడగాల్సి వస్తుంది.
  • ఎంత సేపు రుద్దిన కూడా సరిగా మురికి పోదు.
  • అటువంటి అపుడు నీట్ గా ఈజీగా శుభ్రం చేసుకోవ డానికి వాటర్ ని లైట్ గా వేడి చేయండి.
  • గోరు వెచ్చగా వేడి అయిన తరువాత ఈ వాటర్ లో దువ్వెనలు వేయండి.
  • తర్వాత ఇందులో అంటే ఈ వాటర్ లో హాండ్ వాష్, వంట సోడా వేసి కలపండి.
  • ఈ రెండింటి ని బాగా కలిపి దువ్వెనలు ని అందులో పది నుండి పది హేను నిమిషాలు నాన నివ్వండి.
  • కొంచెం మురికి ఉన్నవి ఆటోమేటిక్ గా పది హేను నిమిషాలు లో శుభ్రం అవుతాయి.
  • ఎక్కువ మురికి ఉన్న దువ్వెనలు లో ఉన్న డస్ట్ లూస్ అవుతుంది.
  • తర్వాత వీటిని పాత టూత్ బ్రష్ తో ఈజీ గా శుభ్రం చేసుకోవచ్చు.

Rightly Placing of Spoons:-

  • మనం సరుకులు తెచ్చి డబ్బాల్లో నిండు గా పోస్తూ ఉంటాం.
  • ఇలా నిండుగా ఉన్నపుడు స్పూన్ పెట్టి క్లోజ్ చేయాలి అంటే కష్టం అవుతుంది.
  • స్పూన్ లోపలి వరకు పోదు కాబట్టి చాలా ఇబ్బంది గా ఉంటుంది స్పున్ పెట్టాలి అంటే.
  • అందుకు అని స్పున్ పెట్ట కుండ ప్రతి సారి వేరే స్పున్ వాడుతూ ఉంటాం.
  • అలా కాకుండా మనం డబ్బాలో ఈజీ గా స్పున్ పెట్ట వచ్చు.
  • అది ఎలా అంటే స్పున్ ని రివర్స్ లో పెట్టి డబ్బా ని క్లోజ్ చేయండి.
  • కనుక మనం ఇలా స్పున్ పెడితే ఎప్పుడు కావాలి అంటే అపుడు అదే స్పున్ తో వాడు కోవచ్చు.

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.