Pooja Room Cleaning tips in Telugu

ఈరోజు నేను మీకు పూజ గది శుభ్రం గా ఉంచు కోవడానికి కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. కొత్తగా పెళ్లి అయిన వాళ్లకి, పూజ చేయడం రాని వారికి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగ పడతాయి.

Pooja Room Cleaning tips in Telugu:-

బ్రాస్ ప్లేట్లు శుభ్రం:-

  • దేవుని దగ్గర మనం ఎక్కువ గా బ్రాస్ ప్లేట్లు, బ్రాస్ కుందులు వాడుతాం.
  • అవి శుభ్రం చేసిన తరువాత కూడా కొన్ని సార్లు శుభ్రం గా, మెరుస్తూ ఉండవు.
  • ఇవి మెరుస్తూ శుభ్రం గా ఉండటాని కి ఒక మంచి టిప్ ఉంది.
  • అది ఏమిటంటే బ్రాస్ ప్లేట్లు ని కొంచెం విభూది తీసుకొని బాగా రుద్దండి.
  • ఇలా కొంచెం సేపు రుద్ది ఆ తరువాత కాటన్ క్లాత్ తో తుడవండి.
  • ఆ తరువాత చూస్తే బ్రాస్ ప్లేటు బాగా మెరుస్తూ ఉంటుంది.
  • ఇలా బ్రాస్ ప్లేట్లు, దీపపు కుందులు ని విభూది వేసి రుద్ది తే మంచి షైన్, కలర్ ఉంటాయి.

కొబ్బరికాయ ని సమానం గా పగల కొట్టడం:-

  • మనం దేవుడి గుడి దగ్గర కొబ్బరి కాయ పగల కొట్టినపుడు ఒకటి చిన్నది గా ఒకటి పెద్దది గా పగులు తుంది.
  • టెంకాయ పగల కొట్టడానికి కొంతమంది కి కష్టం గాను, గాయాలు చేసు కుంటు ఉంటారు.
  • అలా కాకుండా సమానం గా గుండ్రంగా ఉండాలి అంటే ముందు కొబ్బరి కాయ ని కడగండి.
  • తరువాత టెంకాయ పైన ఉండే మూడు గీతాలు ని కొడవలి తో కానీ, రాయి తో కానీ, సుత్తి తో కానీ హా గీత ల పైన కొట్టండి.
  • ఇలా టెంకాయ ని రౌండ్ గా తిప్పుతూ గీత ల పైన కొడితే కొబ్బరి కాయ సమానం గా పగులు తుంది.

మట్టి ప్రమిద లేదా దీపపు కందుల లీకేజీ:-

  • మాములు గా మనం ప్రమీదల లో దీపారాధన చేస్తూ ఉంటాం.
  • వెలిగించిన కొద్ది సేపు తరువాత ప్రమిద కింద నూనె కారి ఉంటుంది.
  • ఇలా నూనె లీక్ కాకుండా ఉండాలి అంటే ప్రమిద ని కొనుక్కుని తీసుకుని రాగానే లేదా వాడినవి అయిన సరే కొంచం సేపు నీళ్లలో నాననివ్వాలి.
  • ప్రమిదల లో ఉండే గాలి అంత బయటకు పోతుంది.
  • ఆ తరువాత ప్రమిద ని ఆరనిచ్చి ఆ తరువాత నెయిల్ పాలిష్ లేదా పెయింట్ తో ప్రమిద అడుగు భాగం వేయండి.
  • ఈ పెయింట్ ని బాగా ఆరనివ్వండి, ఆ తరువాత నూనె వేసి దీపం వెలిగించండి.

సాంబ్రాణి:-

  • ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులో సాంబ్రాణి వేసి మూత పెట్టి ఎప్పుడు కావాలంటే అపుడు వాడుకోండి.

సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్:-

  • మాములు గా మనం కడ్డీ ల ప్యాకెట్ అయిపోయాక పడేస్తూ ఉంటాం.
  • ఈ కడ్డీ ల ప్యాకెట్ కూడా మంచి వాసన ఉంటుంది.
  • అందుకు అని ఈ కడ్డీ ప్యాకెట్ పడేయ కుండా అందులో దూది వత్తులు, దేవుని కి పూల మాల కట్టే దారాలు పెట్టుకోండి.
  • ఇలా చేయడం వలన వత్తులు వెలిగించేటపుడు, పూలు కట్టే టప్పుడు దారాలు మంచి వాసన వస్తాయి.

కుంకుమ లేదా విభూది:-

  • కుంకుమ, విభూది మంచి వాసన రావాలి అంటే అందులో కొంచెం జవ్వాది పొడి వేసి కలపాలి.
  • ఇలా చేస్తే కుంకుమ, విభూది ఎన్ని రోజులు అయిన మంచి వాసన వస్తూ ఉంటాయి.

నూనె ఉన్న ప్రాంతాల్లో శుభ్రం చేయటం:-

  • ఎక్కడ అయితే నూనె ఉంటుందో హా ప్రాంతం లో బియ్యం పిండి లేదా గోధుమ పిండి లేదా పౌడర్ చల్లండి.
  • ఈ పిండి ని నూనె ఉన్న ప్రాంతాల్లో చల్లి ఒక పది నిమిషాలు అలానే ఉంచండి.
  • పిండి ఆయిల్ ని పీల్చు కుంటుంది కనుక పది నిమిషాలు తరువాత క్లాత్ తో తుడవండి.

ఫ్రెష్ గా అగ్గి పుల్లలు ఉంచటం:-

  • ఒక్కో సారి అగ్గి పుల్లలు దేవుని గుడి దగ్గర ఉండే తేమ వలన వెలగవు.
  • అలా తేమ ఉండకుండా ఫ్రెష్ గా ఉండాలి అంటే మాచ్ బాక్స్ లో కొంచెం బియ్యం వేయండి.
  • అగ్గి పెట్టె లో ఉండే తేమ ని బియ్యం పీల్చు కుంటుంది.
  • బియ్యం లేదా చాక్ పీస్ లో ఏది అయిన తేమ ని బాగా పీల్చు కుంటాయి.

ఈజీ గా దీపపు వత్తి వెలిగించడం:-

  • మాములు గా మనం దీపం వెలిగించే టప్పుడు దీపపు కుంది లో వత్తి పెట్టి తడి చేసు కుంటాం.
  • తరువాత వెలిగిస్తే వెలగ టానికి కొంచెం సమయం పడుతుంది.
  • వత్తులు వెంటనే వెలగాలి అంటే కర్పూరం తీసుకొని పొడిగా చేసి వత్తి కి ఈ కర్పూరం పొడి రాయండి.
  • ఇలా చేయుట వలన వత్తి త్వరగా వెలగడం తో పాటు ఎక్కువ సేపు వెలుగు తుంది.

ఖాళీ గాజుల బాక్స్:-

  • మనం మాములు గా గాజుల కి వచ్చే బాక్స్ లని పడేస్తు ఉంటాం, వాటిని దేవుని గదిలో వత్తులు, కర్పూరం బిల్లలు వేసుకోవచు.

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.