Jasmine Health Benefits in Telugu | Uses of Jasmine in Telugujasmine health benefits

హలొ ఫ్రెండ్స్, సాధారణం గా మల్లె పూలు పూజల  కి, పెట్టు కోవడానికి వాడతారు. కానీ ఈ మల్లె చెట్టు నుండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మల్లె చెట్టు ఉపయోగాలు తెలుసుకుంటే కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు అంతగా తెలిసి ఉండక పోవచ్చు.

మల్లె పూలు ఇష్ట పడని ఆడవారు ఉండరు. ఈ మల్లె పూల మీద ఎన్నో పాటలు కుడా ఉన్నాయి. సృష్టి లో లభించే అందమైన పువ్వు లలో మల్లె పూల కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఈ మల్లె పూలు కేవలం అందానికి, సువాసన కే కాదు, ఇవి దివ్య ఔషధం లాగ పని చేస్తాయి.

మల్లె చెట్టు ని ఇంగ్లిష్ లో Jasmine అంటారు. ఇది  ఆలివ్ కుటుంబానికి చెందిన ఒలేసియా జాతికి చెందినది. జాస్మిన్ అనే పేరు పర్షియన్ కి చెందిన పదం యాస్మిన్ నుండి వచ్చినది. యాస్మిన్ అంటే దేవుని నుండి బహుమతి. భారత దేశం లో మల్లె పువ్వు అత్యంత పవిత్రమైనది. మన భారతీయ మహిళలు మల్లె పూలను జుట్టు కి మంచి సువాసన గా పెట్టుకుంటారు. మల్లె పువ్వు పాలిస్తాన్ జాతీయ పుష్పం మరియు ప్రేమ దేవునికి పవిత్ర పుష్పం.

Jasmine Health Benefits in Telugu:-

గుండె సంబంధిత వ్యాధులు:-

  • గుండె కి సంబందించిన వ్యాధులు ఉంటె, ఒక కప్పు మల్లె పూల టీ ని రోజు తీసుకోవాలి.
  • దీని వలన మల్లె పువ్వు లోని క్యాటెచిన్స్, చెడు కొలెస్ట్రాల్ ని నిరోధిస్తుంది.
  • సహజం గా మల్లె పువ్వు లో ఉండే కాటెచిన్స్ ఆక్షీకరణ ప్రక్రియ ని నిరోధిస్తుంది. దీని వలన ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

క్యాన్సర్:-

  • మల్లె పువ్వు లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయి లో ఉంటాయి.
  • ఇవి శరీరం లోని ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహాయ పడతాయి.
  • పర్యావరణం లోని కాలుష్యం, ఆహరం వలన ఫ్రీ రాడికల్స్ తయారు అవుతాయి.
  • ఈ ఫ్రీ రాడికల్స్ నాడీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ కణాల కి గురి అవుతాయి.
  • మల్లె లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉపిరితిత్తుల కాన్సర్, రొమ్ము కాన్సర్, చర్మ కాన్సర్, మూత్రాశయ కాన్సర్ లకు వ్యతిరేకం గా పోరాడుతుంది.

 

  • ఇది ఆందోళన, తల నొప్పి మైగ్రేన్ నొప్పి  ని తగ్గిస్తుంది.
  • నోటి లో పుండ్లు, నోటి పూత లకు ఆకులు నమిలితే ఉపశమనం కలుగుతుంది.
  • మల్లె పూల ను శరీరం యొక్క రోగ నిరోధక శక్తి ని పెంచడానికి, జ్వరం తో పోరాడటానికి ఉపయోగిస్తారు.
  • దీని వేర్లు, పువ్వులు, ఆకులు మల బద్ధకం, అపానవాయువు చికిత్స నివారణ కి ఉపయోగిస్తారు.
  • మల్లె పువ్వు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రిక్ ఎంజైమ్ లతో పోరాడటానికి సహాయ పడతాయి.
  • జీర్ణాశయం లో మంచి బ్యాక్తీరియా పెరుగుదల ని ఇది ప్రోత్సహిస్తుంది.
  • మరియు ఇది శరీరం లోని హాని కరమైన బ్యాక్తీరియా మరియు టాక్సిన్ లను తొలగిస్తుందని నిరూపించబడింది.
  • ఆందోళన, ఒత్తిడి, వడదెబ్బ, అంటు రోగాల చికిత్స కి మల్లె పూల టీ సహాయ పడుతుంది.
  • మల్లె పూల గ్రీన్ టీ తాగడం వలన ఇన్సులిన్ స్థాయి లను నియంత్రించి మధుమేహాన్ని నివారిస్తుంది.
  • చెవి లో పుండు, చీము వంటి వాటికి దీని ఆకు రసం వాడుతారు.
  • మల్లె చెట్టు కాషాయం నోటి దుర్వాసన సమస్య కి వాడుతారు.
  • ఇది చర్మం లోని తేమ ని పునరుద్ధరించి ముడతలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.