Karakkayakarakkaya

Karakkaya Health Benefits in Telugu | Indian Hog Plum Uses in Telugu | Haritaki in Telugu

పూర్వం ప్రతి ఇంట్లో కరక్కాయ కచ్చితంగా వుండేది. పిల్లలు లేని ఇల్లు ఎలా ఉండదో కరక్కాయ లేని ఇల్లు కూడా ఉండేది కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో కరక్కాయ గురించే చాలా మంది కి తెలీదు. కానీ కరక్కాయ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ Karakkaya గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

కరక్కాయ గుణాలు:-

ఈ కరక్కాయ చెట్లు ఆరు నుండి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి భద్రాచలం నుండి గోల్కొండ ప్రాంతాలకు చెందిన అడవుల్లో పెరుగుతున్నాయి. కరక్కాయ పత్రాలు లేదా ఆకులు కాండనికి 2 లేదా ఒకటి చొప్పున దాదాపు కోలగా, పెలుసుగా పెరుగుతాయి.
ఈ  కరక్కాయ పుష్పాలు లేత ఆకు పచ్చ రంగులో సన్నని కంకుల పై నక్షత్రాల లాగా మామిడి పుష్పాల వలె పోలి ఉంటాయి. దీని ఫలాలు కోలగా ఉండి ఎండిపోతే నిలువైన నొక్కులు కలిగి ఉంటాయి.
కరక్కాయ ల ఆకారం, రంగు స్వల్ప తేడాతో అనేక జాతులు రకాలు ఉన్నప్పటికీ ఔషధ గుణాలు మాత్రం ఒకటే. ఇవి ఆగస్టు నెల నుండి అక్టోబరు నెల వరకు దొరుకుతాయి. ఇవి అన్ని ఆయుర్వేద షాపులు, పచారి కొట్ల లోను దొరుకుతాయి.

కరక్కాయ ఉపయోగాలు (Karakkaya Health Benefits in Telugu):-

  • పూర్వం దగ్గుకి ఎలాంటి సిరప్స్ లేవు. అలాంటి రోజుల్లో దగ్గు తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధం కరక్కాయ. దగ్గు వచ్చినపుడు కరక్కాయ ని బుగ్గన పెట్టుకునేవారు. కరక్కాయ లో ఉండే రసాయనాల వలన గొంతులో ఉండే శ్లేష్మాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది.
  • కరక్కాయ మరిగించి నీరు త్రాగితే నోటిలో ఉన్న బాక్టీరియా, పళ్ళ సందులో ఉన్న చెడ్డ బాక్టీరియా, పొట్ట ప్రేగులో ఉండే చెడ్డ సూక్ష్మ జీవులు తొలగిస్తాయి. కరక్కాయ దంత సంబంధింత వ్యాధులను దూరం చేస్తుంది. కరక్కాయ మరిగించిన నీరు పుక్కిలించిన కూడా దంత సంబంధింత చెడ్డ బాక్టీరియా దూరం అవుతాయి.
  • మలబద్దకం తగ్గించడానికి మరిగించిన కరక్కాయ నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • రక్తంలో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడానికి కరక్కాయ సహాయపడుతుంది.
  • కరక్కాయ పొడి తీసుకుంటే మజిల్స్ లో ఉండే నొప్పులు, నడుము నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. దీని చూర్ణం ప్రతి రోజు తేనె తో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. దానితో పాటు చప్పిడి ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే పచ్చ కామెర్లు చాలా తొందరగా తగ్గిపోతాయి.
  • Karakkaya చూర్ణం ఒక భాగం, వేయించిన పిప్పలి చూర్ణం అర భాగం కలిపి తేనె తో ప్రతి 4 గంటలకి ఒకసారి తీసుకుంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది.
  • భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ చూర్ణం లో కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే రక్త మొలలు తగ్గుతాయి.
  • Karakkaya ని తేనెతో తీసుకుంటే విష జ్వరం చాలా తొందరగా తగ్గుతుంది.
  • పసుపు రసము ని ఇనుప పాత్రలో ఉంచి వేడి చేసి కరక్కాయ కల్కము ని చేర్చి బాగా కలిపి కొద్ది కొద్దిగా లేపనం గా చేసి గోరు చుట్టు కి రాస్తే గోరు చుట్టు త్వరగా తగ్గుతుంది.
  • కరక్కాయ ని కాల్చి చూర్ణం చేసి నువ్వుల నూనె కలిపి లేపనం తయారు చేసి రాస్తే కుష్ఠ రోగము తగ్గును. మజ్జిగ లో కరక్కాయ పొడి ఒకటి నుండి రెండు చెంచాల ప్రమాణంలో భోజనానికి ముందు తీసుకుంటే ఒబేసిటీ, బరువు తగ్గుతారు.
  • కరక్కాయ చూర్ణము ని తేనె తో కలిపి తీసుకుంటే వాంతులు త్వరగా తగ్గుతాయి.
  • ఇది మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అలా అని ఎక్కువగా తీసుకోకండి. ఈ కరక్కాయ ఔషధాన్ని వాడే ముందు వైద్యుడిని సంప్రదించండి

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.