gomuthram

Cow Uses in Telugu | Cow Health Benefits in Telugu

ఈ ప్రకృతిలో దేవుడు మన అందరి కోసం సృష్టించిన మహిమాన్విత జీవి ఆవు. ఆవుని గోమాత అని పిలుస్తారు. ఈ గోమూత్రం అత్యంత విలువైనది. గోమూత్రం లో వాతాన్ని పూర్తిగా నియంత్రించగలిగే శక్తి ఉంది. ఈ గోమూత్రం(Gomuthram) తో 148 పైగా రోగాలను నివారించే గుణాలు ఉన్నాయి.

గోమూత్రం లో అత్యధికంగా నీరు శాతం, కాల్షియం ఉన్నాయి. ఇంకా సల్ఫర్, ఐరన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా, 18 రకాల సూక్ష్మ పోషకాలు వున్నాయి. మొదటిగా, 18 రకాల పోషకాలు ఉన్న పదార్ధం మట్టి. పొలంలో ఉండే మట్టిలో మాత్రమే 18 రకాల పోషకాలు ఉంటాయి. మట్టి తరువాత గోమూత్రం లో ఈ పోషకాలు వున్నాయి. కాబట్టే గోమూత్రం తప్పకుండా తీసుకోవచ్చు.

మానవుని శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు గోమూత్రం లో ఉన్నాయి. చర్మ సంబంధించిన వ్యాధి తగ్గడానికి సల్ఫర్ వాడటం వలన తగ్గుతుంది. ఈ గోమూత్రం లో సల్ఫర్ అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి చర్మానికి సంబంధించిన వ్యాధులు గజ్జి, దురద, సోరియసిస్, ఎక్సిమ ఇలాంటి అన్ని వ్యాధులకు గోమూత్రం వాడవచ్చు.

ఈ గోమూత్రం కూడా ఆవు తిరుగుతూ ఉన్నప్పుడు మన దేశవాళీ ఆవు మూత్రం మాత్రమే తీసుకోవాలి. ఆవు కూర్చున్నప్పుడు, తీసుకునే గోమూత్రం అంత ఉపయోగం కాదు.జెర్సీ ఆవులో 3 రకాల పోషకాలు మాత్రమే ఉంటాయి. దేశవాళీ ఆవులో 18 రకాల పోషకాలు ఉంటాయి.

గోమూత్రం(Gomuthram) ఎప్పుడు తీసుకోవాలి?

ఈ గోమూత్రం ఉదయాన్నే తీసుకుంటే మంచిది. ఏదయినా వ్యాధి తో బాధ పడేవారు 100 గ్రాములు రెండు సార్లు గా తీసుకుంటే ఉత్తమం. గోమూత్రం ఎప్పుడు తీసుకున్నా కూడా కాళీ కడుపు తోనే తీసుకోవాలి. రెండు సార్లు తీసుకునే వాలీ ఉదయం తినడానికి ముందు, సాయంత్రం భోజనం చేసాక 4 గంటల తర్వాత తీసుకోవాలి. ఆరోగ్య వంతులు రోజుకి 50 గ్రాములు తీసుకోవాలి.

గోమూత్రం తో ఆరోగ్య ప్రయోజనాలు:-

  • కంటికి సంబంధించిన వ్యాధులు అన్ని గోమూత్రం తో నయం అవుతాయి. శుక్లము, గ్లూకోమా, రెటీనా సంబంధించిన రోగాలు, ఇలా అన్ని కంటి సమస్యలు గోమూత్రం తో నివారించవచ్చు. దేశవాళీ గోమూత్రం తీసుకుని మెత్తటి గుడ్డను ముంచి ఒక్క చుక్కను కంటి లో 3 నుండి నాలుగు నెలలు వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
  • చిన్న పిల్లలు కు చెవిలో చీము కారుతుంటే గోమూత్రం ఒక్కొక్క చుక్కను వేస్తే చెవిలో చీము కారటం తగ్గుతుంది. చెవి కూడా శుభ్రం అవుతుంది.
  • ఇంకా పిల్లలకు ముక్కు కారుతుంటే ఆవు నెయ్యి రెండు చుక్కలు ముక్కులో వేస్తే తగ్గుతుంది. తరచూ జలుబు చేస్తుంటే ఇలా చేస్తే జలుబు త్వరగా తగ్గుతుంది.
  • చాలా మందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఇలా నిద్రలో గురక పెట్టడం చాలా పెద్ద సమస్య. పడుకునే ముందు ముక్కులో ఆవు నెయ్యి రెండు చుక్కలు వేసుకుని పడుకుంటే కొద్ది రోజులకే ఈ సమస్య తగ్గుతుంది.
  • ప్రతి రోజు గోమూత్రం అర కప్పు తాగితే మూత్ర పిండాలు శుభ్రం అవుతాయి. మూత్ర సంబంధించిన వ్యాధులు అన్ని గోమూత్రం తో నయం అవుతాయి.
  • చర్మ రక్షణ కి గోమూత్రం తో మర్దన చేస్తే అన్ని మచ్చలు తొలగిపోతాయి. కంటి కింద నల్లటి చారలు ఉంటే రోజు గోమూత్రాన్ని పొద్దున్నే రాస్తే చారలు తగ్గిపోతాయి.
  • ఎలర్జీ లు పోవాలంటే గోమూత్రం తీసుకుంటే తగ్గుతాయి.
  • క్యాన్సర్ కి గోమూత్రం గొప్ప ఔషధం. గోమూత్రం తో అన్ని రకాల కన్సర్ల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అసలు క్యాన్సర్ రావటానికి ముఖ్య కారణం శరీరంలో కర్క్యుమిన్ అనే కెమికల్ తగ్గడం. ఈ కర్క్యుమిన్ గోమాత్రం లో పుష్కలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:-

 

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.