బుడ్డ బుడస చెట్టు:-

బుడ్డ బుడస మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది. దీనిని బుడ్డ బుడస లేదా కాశి బుడ్డ అని పిలుస్తారు. ఇంగ్లిష్ లో దీనిని స్థానిక గూస్ బెర్రీ, వైల్డ్ కేప్ గూస్ బెర్రీ, పిగ్మీ గ్రౌండరీ అని పిలుస్తారు. మన దేశంలో బుడస కాయలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. యూరోప్ దేశాలలో ఈ బుడస కాయలు బాక్స్ లో పెట్టి అమ్ముతారు. మన తాత లు ఈ కాయల ను ఎక్కువగా తీసుకుంటారు. ఈ తరం వారు వీటిని పిచ్చి చెట్లు అనుకుంటారు. కానీ వీటి కాయలు, ఆకులు, వేర్లు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

గుణాలు:-

  • బుడస  ఆకులు మృదువైనవి. ఇవి 2.5 నుండి 12 సెం.మీ. వరకు పొడవు ఉంటాయి.
  • ఈ బుడ్డ బుడస మొక్క చాలా తేలికగా ఉంటుంది.
  • దీని కాండం గుల్లగా పలుచగా కనిపిస్తుంది. చేతి తో నొక్కి తే వెంటనే వంగుతుంది.

ఔషధ గుణాలు:-

  • బుడ్డ బుడస మొక్క లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
  • ఇది యాంటీ ఇన్ఫలమేటరీ గా పని చేస్తుంది. మన శరీరంలో ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి.
  • యాంటీ పైరటిక్ గుణాలు ఇందులో ఉన్నాయి.
  • ఇది యాంటీ అల్సర్ గా పని చేస్తుంది.
  • యాంటీ బాక్టరీయా గుణాలు ఉన్నాయి.
  • ఈ మొక్క సారం 200 మిల్లి గ్రాములు ప్రతి రోజు తీసుకుంటే అల్సర్లు తగ్గించే గుణం ఉంది.
  • అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో పుండు ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
  • ఈ ఆకు రసం తీసి నుదిటి కి రాసు కుంటే తల నొప్పి ని వెంటనే తగ్గిస్తుంది.
  • కాశి బుడ్డ ఆకులు తీసుకుని మెత్తగా నూరి రసం తీసి చర్మం పైన దురదలు, పుండ్లు, ఉన్న చోట రాస్తే వెంటనే ఉపశమనాన్ని కలిగి స్తుంది.
  • ఈ ఆకుల రసాన్ని ఆవ నూనె తో కలిపి చెవి నొప్పి తో బాధ పడేవారు రెండు చుక్కలు చెవిలో వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • వేరు రసం తీసుకుని తాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.
  • ఆకులు లేదా ఈ మొక్క మొత్తం భాగాన్ని కషాయం చేసుకొని తాగితే అధిక రక్త పోటు తగ్గి నార్మల్ కి వస్తుంది.
  • ఆకు కషాయం మధుమేహం నివారణ కి సహాయ పడుతుంది.
  • కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ ఆకు రసాన్ని పొత్తి కడుపు కి రాస్తే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
  • ఈ బుడ్డ బుడస వేరు శుభ్రం గా కడిగి నమిలి రసం మింగితే వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది.
  • మూత్ర సంబంధించిన వ్యాధులు నయం చేయడానికి ఈ వేరు, ఆకులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.