Balamrutham Mada
tha Kaja recipe in telugu:-
హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బాలామృతం పిండి తో మడత కాజా ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను.
కావలసిన పదార్థాలు:-
- బలామృతం పొడి
- బియ్యం పిండి
- పంచ దార
- యాలకుల పొడి
- నెయ్యి
తయారు చేయు విధానం-:-
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బాలామృతం పిండి ని జల్లించి వేసుకోండి.
- మడత కాజా లు మెత్తగా కాకుండా క్రిస్పీ గా రావాలి అంటే ఇందులో రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి.
- ఇందులో ఇపుడు పావు టేబుల్ స్పున్ యాలకుల పొడి వేయండి.
- అలాగే చిటికెడు ఉప్పు వేసి ఈ పదార్థాలు అన్నిటినీ ఒకసారి కలపండి.
- ఇపుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బాగా వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలపాలి.
- ఫస్ట్ స్పూన్ తో మిక్స్ చేసి తరువాత చేతి తో రబ్ చేస్తున్నట్లు బాగా కలపాలి.
- పిండి ని ముద్ద చేస్తే ముద్ద లాగా వచ్చేలా కలపాలి.
- అలా ముద్ద లా రాకపోతే మరో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.
- ఇపుడు ఇందులో నే కొంచెం కొంచెం గా నీళ్లు వేసుకుంటూ కలపాలి.
- పిండి ని మరీ సాఫ్ట్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలపాలి.
- దీనిని కలిపాక మూత పెట్టి పక్కన పెట్టండి.
షుగర్ సిరప్:-
- ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీరు పాన్ లో వేయండి.
- ఈ పాకాన్ని చక్కెర కరిగే వరకు బాగా మరిగించండి.
- చక్కెర కరిగిన తర్వాత మరో మూడు నిమిషాల పాటు ఇంకా బాయిల్ చేయండి.
- పాకం తీగ పాకం కంటే కొంచెం తక్కువగా, గులాబ్ జామున్ సిరప్ పాకం కి కొంచెం ఎక్కువగా ఉండేట్లు ఉండాలి.
- ఈ స్టేజ్ లొనే ఈ పాకం లో అర టేబుల్ స్పున్ యాలకుల పొడి వేసి కలిపండి.
- పాకం చల్ల గా అవకుండా స్టవ్ ఆపి మూత పెట్టండి.
మడత కాజా తయారు చేయటం:-
- ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరి పిండి, ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టండి.
- మడత కాజా క్రిస్పీ గా రావాలి అంటే కాజా చేసే టప్పుడు ఈ మిశ్రమాన్ని రాయాలి.
- పది నిమిషాలు తరువాత ముందు గా మనం కలిపి పెట్టిన బాలామృతం పిండి ని ఒకసారి మళ్ళీ కలపండి.
- ఇలా మళ్లీ మూడు నుండి అయిదు నిమిషాలు కలపడం వలన మడత కాజాలు క్రీస్పీ గా వస్తాయి.
- ఇపుడు పిండి ని రెండు భాగాలు గా చేసి, ముందు ఒక భాగాన్ని తీసుకోండి.
- పిండి ని పొడి పిండి లో ముంచి తీసి చపాతీ లా, గుండ్రంగా కాకుండా దీర్ఘ చతురస్ర ఆకారం లో రుద్దాలి.
- ఈ పిండి కాజా లు కోసం కాబట్టి వీలయినంత పలుచ గా రుద్దాలి.
- ఇపుడు ఈ లేయర్ ని పక్కన పెట్టి ఇంకొక పిండి ముద్ద ని తీసుకొని మళ్లీ ముందు రుద్దిన విధం గా రుద్దాలి.
- మనం ముందు గా చేసిన లేయర్ పైన వరి పిండి పేస్ట్ రాసి ఇపుడు చేసిన లేయర్ వేసి దానిపై కూడా వరి పిండి పేస్ట్ వేసి ఒక దానిపై ఒకటి వేయండి.
- ఇప్పుడు దాని పైన కావాలంటే పొడి వరి పిండి చల్లి చిన్న గా రోల్ చేసుకోండి.
- ఇలా రోల్ చేసేటపుడు చివర్లో కొంచెం నీళ్ళు చల్లి అతికించండి.
- ఇపుడు రోల్ చేసిన దానిని 1/4 ఇంచ్ తేడా తో ముక్కలు గా కట్ చేయండి.
- ఇలా కట్ చేసాక ఒకొక్క మడత కాజా తీసుకొని చిన్న గా ప్రెస్ చేయాలి.
- మరీ ఎక్కువ గా ప్రెస్ చేయకండి, అలా చేస్తే లోపల ఉన్న లేయర్ లు అతుక్కుంటాయి.
- ఇలా అన్ని ప్రెస్ చేసి, ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వేడి చెయ్యాలి.
- నూనె మీడియం గా వేడి అయ్యాక మడత కాజా లు నూనె లో వేసి మీడియం మంటలో నే ఉంచి క్రిస్పీ గా వచ్చే వరకు ఫ్రై చేయండి.
- మడత కాజాలు గోల్డెన్ రంగు లో వచ్చాక గోరు వెచ్చని పాకం లో వేసి ఒక అయిదు నిమిషాలు ఉంచి తీయండి.
- మీకు మెత్త గా ఎక్కువ స్వీట్ గా కావాలి అంటే మడత కాజా ల ని పాకం లో ఎక్కువ సేపు ఉంచండి.
Post Disclaimer
The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.
The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.