Nalleru Uses in Telugu | Cissus Uses in Telugu

Nalleru Plant:-

హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అందరికి తెలిసిన మొక్క ఉపయోగాలు గురుంచి షేర్ చేస్తున్నాను. అది ఏమిటంటే నల్లేరు చెట్టు, ఇది ఊర్లలో, పల్లెల్లో ఉండే ప్రజలకు చాలా బాగా తెలుసు. ఈ నల్లేరు చెట్లు రోడ్ల పక్కన, కొండల దగ్గర, ఊర్లలో పల్లెల్లో బాగా కనిపిస్తుంది.

Nalleru Properties:-

నల్లేరు చెట్టు 2 నుండి 10 మీటర్ల వరకు పెరిగే బహు వార్షికపు తీగ. ఈ నల్లేఆరు శాఖలు నాలుగు పలకల కాడల వలె ఉంటాయి. దీని కనుపు దగ్గర ఒక ఆకు ఉంటుంది. దీనికి దురుగా ఒక నులి తీగ ఉంటుంది. నల్లేరు చెట్టు పువ్వులు వంగ పండు రంగులో చిన్న గుత్తులు గా ఆకు ఎదురు గా వస్తాయి. నల్లేరు చెట్టు కాయలు గుండ్రం గా ద్రాక్ష పండ్ల వలె నే ఉంటాయి.

నల్లేరు ని ఎండ పెట్టి చూర్ణం చేసి ఒక చెంచా సమ ప్రమాణం లో నెయ్యి కలిపి తీసుకుంటూ, పాలు త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజులు తీసుకుంటే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి.

ఇటీవల జరిగిన పరిశోధన లలో  విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేట్లు చేసే శక్తి నల్లేరు కి ఉన్నట్లు గా నిరూపించ పడింది. నల్లేరు మరియు మినప్పప్పు తో చేసిన వడియాలు తింటే మొలల వ్యాధి నివారించ పడుతుంది.

ఈ నల్లేరు చెట్ల ని కొన్ని వేలాది సంవత్సరాల నుండి ఎన్నో ఔషధ గుణాల తో గౌరవించే మొక్క. హెమరాయిడ్స్, ఆస్తమా, ఎలర్జీ, గౌట్ ఇంక మరెన్నో వ్యాధులకు చికిత్స చేయబడింది.

ఇటీవల జరిగిన పరిశోధన లలో ఎముకల బలానికి, కీళ్ళ నొప్పుల కు, డయాబెటిస్, హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటి దీర్ఘ కాలిక వ్యాధుల నివారణకు నల్లేరు ఎంతో సహాయం చేస్తుంది అని నిరూపించ బడింది.

నల్లేరు ఉపయోగాలు:-

ఈ నల్లేరు మొక్క ఎందుకు అంత విలువైనదో పూర్తిగా అర్ధం చేసుకోవడానికి నల్లేరు యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా చూద్దాం.

గుండె ఆరోగ్యం:-

  • నల్లేరు నేరుగా తక్కువ కొలెస్ట్రాల్ స్థాయి లతో ముడి పడి ఉంది.
  • శరీరం లో జీవక్రియ కారకాల పై బలమైన ప్రభావం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
  • దీని వలన గుండె వ్యవస్థ ను అధిక ఒత్తిడి, స్ట్రోకులు, అధిక రక్త పోటు నుండి రక్షించ బడుతుంది.

ఎముకల కు బలం:-

  • నల్లేరు నిజానికి ఎముకల ఆరోగ్యాన్ని చాల ముఖ్యమైన విధంగా ప్రభావితం చేస్తుంది.
  • ఎముకల పెరుగుదల కి కారణమయ్యే, శరీరం లోని ఆస్టియోబ్లాస్ట్ కణాల ఉత్పత్తి ని ప్రేరేపిస్తుంది.
  • విరిగిన ఎముకల కు వైద్యం ప్రక్రియ ని వేగవంతం చేస్తుంది.

మంట ని తగ్గించడం:-

  • శరీరం అంతా వచ్చే వాపు, చికాకు, మంట తగ్గించ డానికి నల్లేరు సహాయ పడుతుంది.
  • హెమరాయిడ్ లక్షణాల కి చికిత్స చేయడానికి, తగ్గించ డానికి  నల్లేరు ముఖ్య పాత్ర వహిస్తుంది.

శ్వాస సంబంధిత రుగ్మత:-

  • నల్లేరు యొక్క ప్రభావాలు మన సిస్టం కోసం స్టెరాయిడ్ లతో సమానం గా పని చేస్తుంది.
  • ఆస్తమా మరియు శ్వాస సంబంధిత వ్యాధుల తీవ్రత ని నల్లేరు తగ్గిస్తుంది.

మధుమేహం:-

  • నల్లేరు డయాబెటిస్ నిరోధక సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
  • డయాబెటిస్ ద్వారా ప్రేరేపించ బడిన పరిస్థుతలకి వ్యతిరేకం గా పోరాడుతుంది.

గాయాన్ని నయం చేయడం:-

  • నల్లేరు లో కొల్లాజెన్ అధికం గా ఉంటుంది.
  • దీని వలన గాయం మరియు అనారోగ్యం నుండి త్వరగా కోలుకుంటారు.

దంత సంరక్షణ:-

  • నల్లేరు తీసుకోవడం వలన దంతాలు దృఢం గా తయారవుతాయి.
  • దంత సంబంధిత వ్యాధులు నయం చేయడానికి నల్లేరు బాగా సహాయ పడుతుంది.

బరువు తగ్గడం:-

  • నల్లేరు యొక్క అత్యంత విలువైన ప్రయోజనం బరువు తగ్గడం.
  • ఆరోగ్య కరమైన బరువు తగ్గడాన్ని  ప్రోత్సహించ డానికి నల్లేరు వాడటం వలన ఆకలిని అణచి వేస్తుంది.
  • మరియు జీవ క్రియ ని ప్రేరేపించడం ద్వారా బరువు కేలరీ లను వేగంగా బర్న్ చేస్తుంది.
  • నల్లేరు కొవ్వు ని కరిగించే శక్తి ని నిరంతరం ప్రదర్శిస్తుంది.

ఇతర ఉపయోగాలు:-

  • నల్లేరు రుతుస్రావం సమయం లో తిమ్మిరి మరియు అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • ఈ నల్లేరు లో అధిక స్థాయి ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. దీని వలన శరీరం లో వ్యాధి నిరోధక శక్తి  ని పెంచుతుంది.
  • అంటు వ్యాధులు మరియు అనారోగ్యం తో పోరాడటానికి నల్లేరు తెల్ల రక్త కణాల ఉత్పత్తి ని పెంచుతుంది.

ముఖ్యమైన విషయాలు:-

  • గర్భ ధారణ సమయంలో, తల్లి పాలు ఇచ్చే బాలింతలు నల్లేరు తీసుకోకూడదు.

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.