హలో  ఫ్రెండ్స్ , ఈరోజు నేను మీకు పునర్నవ గురించి షేర్ చేస్తున్నాను. పునర్నవ ని అటుక  మామిడి అని కూడా అంటారు. ఈ  పునర్నవ ని సంస్కృతం లో పునర్ జీవుతున్ని చేస్తుందని అంటారు. ఇది వర్షా కాలం లో ఎక్కడ బట్టిన పిచ్చి మొక్కల లా పెరుగుతుంది. మన భారత దేశం లో దీనిని  కూరలలో ఆకు కూరగా ఎక్కువ గా ఉపయోగిస్తుంటారు. పునర్నవ  కాండం, వేర్లు, ఆకులు, అన్ని భాగాల లో ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. ఈ పునర్నవ ని కొన్ని ప్రాంతాల లో గలిజేరు అని కూడా పిలుస్తారు.

పునర్నవ మల్లి కణాలను ఉత్పత్తి చేసే మొక్క. అటుక మామిడి చెట్టు నాలుగు గంట ల లోనే పుస్పించే మొక్క. ఈ మొక్క ని చూర్ణం గా కానీ, కాషాయం గా కానీ, జ్యుస్ లా కాని ఉపయోగించు కోవచ్చు.

Nutrients in Punarnava in Telugu:-

పునర్నవ లో అనేక ప్రోటీన్లు, న్యూట్రియంట్స్ ఉన్నాయి.

  • విటమిన్ సి
  • సోడియం
  • కాల్షియం
  • ఐరన్
  • సెరాటజెనిక్ యాసిడ్
  • బోరావినోన్ A టు F
  • లిరియోడెండ్రాన్
  • ఓలినోలిక్ యాసిడ్

Punarnava Properties in Telugu:-

  • అటుక మామిడి లేదా పునర్నవ చెట్టు సుమారు మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.
  • ఇది తెగలు విస్తరించి పెరిగే చిన్న మొక్క.
  • పునర్నవ పువ్వులు లేత గులాబీ రంగులో అతి చిన్నవి గా కొమ్మల చివర వస్తాయి.
  • దీని ఆకులు కణుపు కి రెండు చొప్పున గుండ్రం గా ఉంటాయి.

Punarnava Uses in Telugu:-

అర్ధరైటిస్:-

  • పునర్నవ లో శక్తి వంతమైన  యాంటీ ఇన్ఫ్లమేటరి మరియు అనాల్జేసిక్ గుణాలు ఉన్నాయి.
  • ఇవి కీళ్ల నొప్పులు తగ్గించ డానికి సహాయ పడుతుంది.
  • రుమటాయిడ్ అర్ధ రైటిస్ వంటి దీర్ఘ కాళిక వ్యాధులను నయం చేస్తుంది.

జీర్ణక్రియ:-

  • పునర్నవ ని కడుపు లో మంట తగ్గించ డానికి , పెద్ద ప్రేగు శోథ కి చాల ప్రయోజన కరం గా ఉంటుంది.
  • ఇది జీర్ణ రసాల స్రావంను ప్రేరేపిస్తుంది. దాని వలన అవసర మైన పోషకాల శోషణ ని పెంచుతుంది. జీర్ణ క్రియ ని మెరుగు పరుస్తుంది.

మధుమేహం:-

  • పునర్నవ శరీరం లోని రక్తం లో చక్కర స్థాయి లను నియంత్రించడం లో అత్యంత ప్రయోజనకరం గా ఉంటుంది.
  • మూలిక ని తీసుకునేటప్పుడు బీటా ప్యాంక్రియాటిక్ కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి చురుకు గా మారుతుంది.
  • ఈ పునర్నవ పిండి పదార్ధాల ను గ్లూకోజ్ గా విచ్చిన్నం చేయడాన్ని తగ్గిస్తుంది.
  • ఇంకా ఇది రక్తం లో చక్కర పెరగడాన్ని నివారిస్తుంది.

గుండె పని తీరు:-

  • పునర్నవ గుండె ధడ తో బాధ పడుతున్న రోగులకు అత్యంత ఉపయోగ కరంగా ఉంటుంది.
  • గుండె పోటు , నొప్పి, ని తగ్గించ డానికి సహాయ పడుతుంది.

బరువు తగ్గడం:-

  • పునర్నవ అధిక కొవ్వు ని తగ్గించ డానికి కీలక పాత్ర పోషిస్తుంది.
  • శక్తి వంతమైన బయోయాక్టీవ్ కాంపోనెంట్స్ ఉండటం వలన బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది.
  • రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది,
  • శరీరం లోని అవాంఛిత ద్రవాలను మరియు హాని కరమైన టాక్సిన్ లను కడిగి శరీర బరువు ని తగ్గిస్తుంది.

మూత్ర రుగ్మత:-

  • మూత్రాశయం లో, మూత్ర పిండం లో  రాళ్లు చేరితే శుభ్రం చేయడానికి బాగా ఉపయోగ పడుతుంది.
  • శరీరం లో మలినాలు  తొలగించ డానికి సహాయ పడుతుంది.
  • దీర్ఘ కాలంగా ఉన్న కిడ్నీ ఫెయిల్యూర్ లో పని చేయడానికి సహాయ పడుతుంది.
  • ఇటీవల జరిగిన పరిశోధన లలో చెడిపోయిన కిడ్నీ కణ జాలం తిరిగి యథా స్థితి కి వచ్చింది అని కనుగొన్నారు.
  • మూత్ర విసర్జన, మూత్ర పిండాల్లో రాళ్లు మరియు బాధాకరమైన మూత్ర విసర్జన ను నివారించడాం లో కీలక పాత్ర వహిస్తుంది.
  • మూత్ర నాళం లో బ్యాక్తీరియా, ఇన్ఫెక్షన్లు నివారించ డానికి, మూత్ర విసర్జన సమయం లో మంట , నొప్పి ని తగ్గిస్తుంది.

ఇతర ప్రయోజనాలు:-

  • కంటి చూపుని మెరుగు పరుస్తుంది.
  • పునర్నవ మన శరీరం లో  చోట నీరు చేరితే ఆ నీటిని తగ్గించ డానికి సహాయ పడుతుంది.
  • ఈ పునర్నవ మొక్క ని దంచి తీసిన రసం రోజుకి రెండు చెంచాలు రెండు సార్లు తేనె తో కలిపి సేవిస్తే కాళ్ళ కి ముఖానికి వచ్చే వాపులు, ఉబ్బు కామెర్లు తగ్గుతాయి.
  • మధు మేహం వ్యాధి తో బాధ  పడే వారికి రక్తం లోని గ్లూకోజ్ ని తగ్గిస్తుంది.
  • కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధుల కు పునర్నవ ని ఎక్కువ గా ఉపయోగిస్తారు.
  • మన శరీరం లో ఏమైనా ఇన్ఫెక్షన్లు కానీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కానీ ఉంటే తగ్గించ డానికి ఉపయోగిస్తారు.
  • పునర్నవ ని కఫాన్ని నివారించ డానికి సహాయ పడుతుంది.
  • వాత సంబంధించిన వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు.

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.