when to eat

Indroduction About When to Eat?

ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడానికి మన శరీరం అనుకూలంగా వుండదు. ఎందుకంటే మన శరీరంలో అంటే పొట్ట భాగం లో జటరాగ్నిఉంటుంది. జటరాగ్ని అంటే జీర్ణ వ్యవస్థ అని అంటారు.

జటరాగ్ని ప్రదీప్తమై ఉన్నప్పుడు ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తుంది. అలా జీర్ణం అయిన ఆహారమే మన శరీరానికి ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఇలా తినే అలవాటు మన భారతీయ శాస్త్రాల లో లేదు.
ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు యూరోప్ దేశాల వారిది. తరచూ కొద్ది కొద్దిగా తింటూ ఉండండి అని యూరోప్ దేశాల వైద్యులు చెబుతూ ఉంటారు.
కానీ మన శాస్త్రాలు, ఆయుర్వేద వైద్యులు, పురాణాలు, సూర్యుడు ఉదయించిన మూడు గంటల వరకు జటరాగ్ని బాగా ప్రదీప్తమై ఉంటుంది.

When To Eat in Telugu?

సహజంగా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు భోజనం చేయాలి అని అందరు అంటూ ఉంటారు. కానీ శాస్త్రాలు, మన ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారు అంటే

“యామ మధ్యేనా భోక్తవ్యం

యామ యుగ్మము న లాఙ్గయేత్”

యామం అనగా మూడు గంటలు. ఒక రోజుకి ఎనిమిది యామాలు ఉంటాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత నుండి లెక్క వేస్తే మొదటి మూడు గంటల్లో ఆహారం సేవించకూడదు. ఆ తరువాత వచ్చే మూడు గంటల వ్యవధిలో భోజనం చేయాలి. ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలకు కొంత సమయం తేడాతో సూర్యోదయం అవుతుంది.

అయితే ఎక్కడివారికి అయినా వారి ప్రాంతంలో సూర్యోదయం అయిన తర్వాత మాత్రమే రెండు నుండి మూడు గంటల వరకు జటరాగ్ని ప్రదీప్తమై ఉంటుంది. కాబట్టి ఆ టైమ్ లో మాత్రమే భోజనం చేయాలి.

అంటే సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తే ఆరు నుండి 9 గంటల వరకు భోజనం చేయరాదు. 9 తరువాత నుండి 12 గంటల లోపు పగటి భోజనం చేయాలి.

అదే విధంగా రాత్రి అనేది సూర్యుడు అస్తమించాక మొదలవుతుంది. రాత్రి భోజనం సూర్యాస్తమయం అయిన దగ్గర నుండి మూడు గంటల లోపు చేయాలి.

ఇలా చేయడం వలన మనం తిన్న ఆహారం లో ప్రతి గింజ ప్రతి మెతుకు సంపూర్ణంగా జీర్ణం అయి శరీరానికి ఉపయోగపడుతుంది. ఇలా జటరాగ్ని పని చేసే సమయంలో మాత్రమే పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందుకే జటారాగ్ని పని చేసే టైమ్ లోనే మనం ఆహారం కడుపు నిండా తీసుకోవాలి. ఎంత తినగలరో అంత ఆహారం ఆ సమయంలో తినాలి.

పూర్వ కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే భోజనం చేసేవారు. ఈ నియమాన్ని అందరూ కచ్చితంగా పాటించేవారు.

ఈ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అనే వాస్తవాన్ని తెలుసుకోవాలి.

ఈ సృష్టి లో మనిషి తప్ప అన్ని రకాల జీవులు సక్రమైన సమయంలో సక్రమైన ఆహారం తీసుకుంటాయి. అంటే పిచుకలు, ఆవులు, గేదెలు, కోతులు ఏ జీవి ని అయినా గమనించండి. అవి ఉదయం లేవటంతో ఆహారాన్ని తింటాయి. రెండు గంటల తర్వాత నీళ్లు గుటక గుటకగా తాగుతాయి. అందుకే వాటికి ఎటువంటి రోగాలు, మధుమేహం, అధిక బరువు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Researches About When To Eat?

శ్యామ్ భాగ్ అనే ప్రొఫెసర్ పరిశోధన కూడా చేసి చెప్పారు. పరిశోధనల్లో ఒక కోతిని తీసుకొని ప్రయోగం చేశారు. కోతికి జబ్బును తెప్పించటం కోసం ఎన్నో రకాల వైరస్ లను ఇంజెక్షన్స్ ద్వారా రక రకాలుగా ఎక్కించి చూసారు. దానికి కొంచెం కూడా కొలెస్ట్రాల్ కానీ, ఏ జబ్బు కూడా రాలేదు. ఎందుకంటే అది సూర్యోదయం అయిన గంట లోపే ఆహారం తీసుకుంటుంది. అంతే కాకుండా నీటిని ఆహారం తిన్న తరువాత గుటక గుటకలు గా రెండు మూడు గంటల తరువాత తీసుకుంటుంది అని చెప్పారు.

రోజులు మారే కొంది భోజనం విధానాలు కూడా పూర్తిగా మారిపోయాయి. బేకరీలు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కుప్ప తెప్పలుగా వచ్చాయి.

తక్కువ సేపు పని చేయడం, ఎక్కువ విశ్రాంతి నతీసుకోవడం, శారీరిక శ్రమ అసలు లేకపోవడం సగటు భారతీయుని అలవాటు అయింది అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఎక్కువగా తినడం కూడా దీనికి తోడు అయింది. దీని వలన ఒబేసిటీ, దాని వలన వచ్చే రక్త పోటు, మధుమేహం(డయాబెటిస్) లాంటి రోగాలు ఈరోజుల్లో చాలా మందికి ఎక్కువగా చూస్తున్నాం.

When to Eat in Fasting:-

ఇంక ఫాస్టింగ్ అంటే ఉపవాసం అని చేస్తు ఉంటారు. నిజానికి ఫాస్టింగ్ అంటే 24 గంటల సమయం కచ్చితంగా పాటించాలి. కానీ చాలా మంది ఆరు నుండి 8 గంటలు ఆహారం తీసుకోకుండా, ఏ పని చేయకుండా రాత్రి పూట పడుకొని ఉదయాన్నే లేచి ఉపవాసాన్ని బ్రేక్ చేసి టిఫిన్ లేదా భోజనం చేస్తూ ఉంటారు.

FAQS About When to Eat:-

ఇష్టమైన ఆహారం లేదా స్నాక్స్ ఎప్పుడు తినాలి?

మీకు ఇష్టమైన ఆహారం, కోరికగా తినాలి అనుకునే ఆహారం మొత్తం ఉదయం భోజనం లోనే తీసుకోవాలి.

స్వీట్స్ తినవచ్చా?

ఏ పిండి వంటలు అయినా స్వీట్లు అయిన తృప్తి పరచే ఏ ఆహారం అయినా ఉదయాన్నే తినండి.

మన శరీరంతో పాటు మన మనసు కూడా తృప్తి పడటం కూడా ముఖ్యమే. మన మనస్సు కొన్ని ప్రత్యేక పదార్ధాల తో నడపబడుతుంది. కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ తో అయితే డాక్టర్లు పెనీయల్ గ్లాండ్ ని మనసుగా పరిగణిస్తారు. పెనియల్ గ్లాండ్ ఎన్నో రకాలుగా స్రవిస్తుంది. మనం తృప్తిగా భోజనం చేసినప్పుడు ఇది కొన్ని రకాల ద్రవాలను స్రవిస్తుంది. మనం తృప్తిగా లేనప్పుడు ఈ పెనియల్ గ్లాండ్ చాలా అస్తవ్యస్తం అవుతుంది. ఇలాంటప్పుడు మనకి చాలా రకాల సమస్యలు వస్తాయి. మనం తృప్తిగా భోజనం చేయకపోతే మానసిక సమస్యలు వస్తాయి. మనం ఎక్కువ కాలం తృప్తికరమైన భోజనం చేయకపోతే, డిప్రెషన్ సిజోఫ్రీనియా వంటి భయంకరమైన మానసిక రోగాలు 27 రకాలుగా వచ్చే ప్రమాదం ఉంది.

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.