TanikayaTanikaya

Tanikaya Uses in Telugu | Terminalia Bellirica Uses in Telugu | Bibhitaki

Tanikaya చెట్టు అయిదు నుండి 15 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు, పత్రాలు బాదాం చెట్టు ఆకుల వలే చివరి భాగం వెడల్పు గాను , కాడ వైపు కొంచెం సన్నగా ఉంటాయి. ఇవి కొమ్మల చివర కొంచెం ఒత్తుగా ఉంటాయి.
తాని కాయ, కరక్కాయ, ఉసిరి కాయ కలిపి చేసిన మిశ్రమాన్ని లేదా పొడి ని త్రిఫల చూర్ణం అని అంటారు. ఈరోజు నేను మీకు తానికాయ ఉపయోగాలు(Tanikaya Uses in Telugu) షేర్ చేస్తున్నాను.

అధిక వేడిని కలిగించే తానికాయలు మన తెలుగు రాష్ట్రల్లో చాలా ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. ఈ తానికాయల చెట్టు బాదం చెట్టు వలె ఉంటుంది. అదే విధంగా ఆకులు ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత పసుపు రంగు వలె, నక్షత్ర ఆకారంగా చిన్న సైజు కంకులని కలిగి ఉంటుంది. తానికాయలు చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్షపళ్ల వలె గుండ్రంగా ఉంటాయి. కొంచెం పండ్లు గా వచ్చాక ఉసిరి కాయ సైజులో మట్టిరంగులో ఉంటాయి.

ఉప్పు తప్ప మిగిలిన ఇదు రుచుల ను తానికాయ కలిగి ఉంటుంది. Tanikaya ని ఆరోగ్య ప్రదాయిని అని అంటారు. దీనిని వాక కాయలు అని కూడా అంటారు. త్రిఫలాలలో తానికాయ ఒకటి. Tanikaya కి త్రిదోషాలను తగ్గించే శక్తి ఉంది.

తానికాయ ఉపయోగాలు (Thanikaya Health Benefits in Telugu):-

  • Tanikaya కఫ వ్యాదులను తగ్గించటానికి బాగా పనిచేస్తుంది.
  • ఈ తానికాయలు జీర్ణ వ్యవస్ధలో వచ్చే వ్యాధులను తగ్గించటానికి, శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించ టానికి ఉపయోగ పడుతుంది.
  • ఇందులో వేడి చేసే గుణం మొలలు నివారించ టానికి, అతిసారాన్ని నివారించేందుకు ఉపయోగ పడుతోంది.
  • జీర్ణ సంబంధిత మందుల తయారీ కి, దగ్గు, కఫం, క్షయ, ఆస్తమా, ఎలర్జీలను నివారణ కోసం తానికాయ మంచి మందుగా ఉపయోగపడుతుంది.
  • తానికాయ ని డయేరియా, చిన్న పేగుల వాపు మొదలైన వ్యాధులు తగ్గించటానికి ఉపయోగిస్తారు.
  • పొట్ట కి సంబంధించిన రోగాలను తగ్గించ టానికి ఉపయోగిస్తారు.
  • జుట్టు పెరగటానికి, జుట్టు నల్ల పడటానికి తానికాయ ఉపయోగిస్తారు.
  • మూత్ర సంబంధించిన పిండాలను శుభ్రపరచ డానికి తానికాయ లను ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. లివర్‌కి సంబంధించిన మెడిసిన్, టానిక్‌ తయారీ కి తానికాయ ఉపయోగిస్తారు.
  • Tanikaya కంటి చూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
  • తానికాయ అరగదీసి సర్పి అను చర్మ వ్యాధికి లేపనం గా రాస్తే మంట, నొప్పి తగ్గుతుంది.
  • ఈ తానికాయ చూర్ణం ఎక్కువ తేనె లో కలిపి తీసుకుంటే దగ్గు, ఉబ్బసం వ్యాధులు వెంటనే తగ్గుతాయి.
  • తానికాయ ని కాల్చి చూర్ణం చేసి కొంచెం సముద్రపు ఉప్పు కలిపి తీసుకుంటే ఎక్కువ సార్లు అవుతున్న విరోచనాలు తొందరగా కట్టుకుంటాయి.
  • ఈ తానికాయ ని బుగ్గన లేదా పుక్కిట పెట్టుకొని రసం మ్రింగినా… తానికాయ చూర్ణం చేసి బెల్లం తో కలిపి ఉండలు లేదా గుటికలు గా చేసుకొని అయినా…శొంఠి కారక వలపు ని బుగ్గన లేదా పుక్కిట లో ఉంచి రసం మ్రింగినా ఆయాసం, దగ్గు త్వరగా తగ్గుతాయి.
  • Tanikaya, అస్వగంధం చూర్ణం బెల్లం తో కలిపి తీసుకుంటే వాత రోగాలు నయం అవుతాయి.
  • ఉబ్బసం, దగ్గు నయం చేయడానికి తానికాయ యొక్క రసం ముఖ్య పాత్ర వహిస్తుంది.
  • తానికాయ లో గ్లూకోజ్, షుగర్, మైనిటల్, ఎలాజిక్‌ యాసిడ్‌, గ్లాక్టోజ్‌, ఫ్రక్టోజ్‌, రమ్‌నోస్‌, ఫాటియాసిడ్లు, గాలిక్‌ యాసిడ్‌, బెటాసిటోస్టిరాల్‌ మొదలైన వైద్య సంబంధిత గుణాలు కలిగిన మందులు చాలా ఉన్నాయి.
  • ఈ తాని కాయల గింజల ని కూడా వైద్యులు మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారు. తానికాయ గింజలు లో ఆక్సాలిస్‌ యాసిడ్లు, ప్రోటీన్‌లున్నాయి.

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.