Thursday, November 21, 2024
HomeRECIPESBalamrutham Madatha Kaja in Telugu | Madatha Kaja with Balamrutham

Balamrutham Madatha Kaja in Telugu | Madatha Kaja with Balamrutham

Balamrutham Madatha Kaja in Telugu | Madatha Kaja with Balamrutham

హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బాలామృతం పిండి తో మడత కాజా ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను. ఈ మడత కాజ(Balamrutham Madatha kaja) లు క్రిస్పీ గా జూసీ గా రావాలి అంటే కింద ఇచ్చిన టిప్స్ ఫాలో అవ్వండి.

కావలసిన పదార్ధాలు(Ingredients For Balamrutham Madatha Kaja) :-

  • బాలామృతం పిండి
  • మైదా పిండి
  • బియ్యం పిండి
  • యాలకులు
  • ఉప్పు
  • నెయ్యి
  • పంచదార

తయారు చేయు విధానం(Procedure For Madatha kaja with Balamrutham):-

  • ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అర కప్పు బలామృతం పిండి, అర కప్పు మైదా పిండి తీసుకోవాలి.
  • ఈ బలామృతం పిండి, మైదా పిండి జల్లించి తీసుకోవాలి లేదంటే ఉండలు ఉండటం నూకలు ఉండటం జరుగుతుంది.
  • ఇందులో రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే మడత కాజాలు క్రిస్పీ గా వస్తాయి.
  • ఇపుడు ఇందులోనే పావు చెంచా యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలపాలి.
  • ఆ తరువాత ఒక స్పూన్ వేడిగా ఉన్న నెయ్యి వేసి చేతితో బాగా రబ్ చేస్తూ కలపాలి.
  • వేడి గా ఉన్నప్పుడు స్పున్ తో కలిపి కొంచెం ఆరిపోయాక చేత్తో కలపండి.
  • పిండిని చేతిలో తీసుకుంటే ముద్ద లా అవ్వాలి లేకపోతే రెండు స్పూన్లు వేడి నెయ్యి కలపాలి.
  • ఇపుడు ఇందులో కొంచెం కొంచెంగా మంచి నీరు కలిపి చపాతీ పిండి లా కలపండి.
  • కలిపిన తరువాత ఒక ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి.
  • ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపి పేస్ట్ లా చేయండి.
  • పది నిమిషాల తరువాత చపాతీ పిండిని ఒక సారి బాగా కలపి పిండిని రెండు భాగాలుగా చేయండి.
  • ఇప్పుడు ఒక ముద్ద ని తీసుకుని పొడి పిండిలో ముంచి తీసి మరీ గుండ్రంగా కాకుండా దీర్ఘ చతురస్ర ఆకారంలో రుద్దండి.
  • ఈ చపాతీ ని మందంగా కాకుండా వీలైనంత పల్చగా రెండు ముద్దలు రెండు చపాతీ లా రుద్దాలి.
  • ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన బియ్యం పిండి పేస్ట్ ని ఒక చపాతీ కి రాయాలి.
  • ఇంకో చపాతీ ని కూడా మొదటి చపాతీ పై పెట్టి మళ్ళీ బియ్యం పిండి పేస్ట్ రాయాలి.
  • ఇపుడు ఈ రెండింటిని ఒక్కసారే రోల్ చేసుకుంటూ చివర కొంచెం నీరు రాసి అతికించాలి.
  • తర్వాత మరీ లావుగా కాకుండా అర ఇంచు మందంలో కట్ చేయాలి.
  • ఇపుడు ఒక్కో కాజా తీసుకుని లైట్ గా ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే షేప్ పోతుంది.
  • ఇపుడు ఒక పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేసి నూనె వేడి అయ్యాక మడత కాజాలు వేసి డీప్ ఫ్రై చేయాలి.
  • హడావుడి గా ఫ్రై చేయకుండా మంట మీడియం లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి.

సుగర్ సిరప్ తయారు చేయు విధానం:-

  • ఒక పాన్ తీసుకుని ఒక కప్పు పంచదార, ఒక కప్పు మంచి నీరు పోసి స్టవ్ మీద పెట్టండి.
  • పంచదార కరిగే వరకు తక్కువ మంట మీద ఉంచి ఆ తర్వాత మీడియం మంట పై పెట్టి బాయిల్ చేయండి.
  • పాకం కొంచెం థిక్ గా వచ్చే వరకు బాయిల్ చేయాలి. మరీ జామున్స్ పాకం లా ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ పాకం కూడా రాకూడదు.
  • ఒక తీగ పాకం వచ్చే రెండు నిమిషాల ముందు వరకు బాయిల్ చేయాలి.
  • చివర్లో అర స్పున్ యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి ఒక మూత పెట్టి పక్కన పెట్టండి.
  • డీప్ ఫ్రై చేసిన మడత కాజాలను గోరు వెచ్చని పంచదార సిరప్ లో వేసి పాకానికి బాగా పట్టించండి.
Post Disclaimer

The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.

The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.

RELATED ARTICLES

Most Popular