konda jana kayalu

హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రకృతిలో మనకు సహజంగా లభించే కొండ జాన పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు గురించి షేర్ చేస్తున్నాను. కొండ జాన పండ్లు వర్షా కాలం లో విరివిగా కనిపిస్తాయి. ఈ కొండ జాన పండ్లు ని జాన కాయలు, చిన్న జాన కాయలు, అడవి జాన కాయలు అని ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తారు.

జాన పండ్ల చెట్టు టిలేసి జాతికి చెందింది. దీని బొటానికల్ నామం Grewia Damine. ఇవి పచ్చి గా ఉనప్పుడు ఆకు పచ్చగా ఉంటాయి, పడితే గులాబీ రంగులో ఉంటాయి. ఎక్కువగా పండితే నలుపు రంగులో మారి పోతాయి. కొండల్లో, అడవుల్లో విపరీతంగా కనిపిస్తాయి. ఊర్లలో, పల్లెలో ఉండే వారికి చాలా బాగా తెలుసు ఈ జాన పండ్లు.

ఈ కొండ జాన పండ్ల లో పోషకాలు తెలిస్తే ఎవరూ వదలకుండా తింటారు. వీటిని పట్టణాల్లో కూడా, ఊర్లలో కోసుకుని పోయి అమ్ముతారు. ఈ కొండ జాన పండ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. జాన పండ్లు పచ్చిగా ఉన్నపుడు పుల్లగా, పండినపుడు నోట్లో వేసుకోగానే కరిగిపోయి తియ్యగా మంచి రుచిని కలిగి ఉంటాయి. ఈ అడవి జాన కాయలు మన తెలుగు రాష్ట్రాల లో రోడ్ల పక్కన, ఊర్లలో, కొండల్లో అధికంగా కనిపిస్తుంటాయి.

కొండ జాన కాయలు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు. అడవి జాన కాయల ఆకులు, పండ్లు, బెరడు, వేర్లు ఆయుర్వేద వైద్యం లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మేము మా చిన్న తనం లో స్కూల్ కి సెలవు రోజుల్లో ఈ జాన పండ్ల కోసం వెళ్ళేవాళ్ళం చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఈ పండ్లు కోయడానికి చాలా ఉత్సాహంగా, స్నేహితులం అందరం కలిసి పోటీ పెట్టుకుని మరీ కోసేవాళ్ళం. జాన పండ్లు ఒక్కసారి తింటే అసలు వదలరు ఇంకా మా బాబు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటాడు.

పిల్లలు ఎదుగుదల కి, మెదడు పని తీరుకి, ఎత్తు పెరగటానికి ఈ జాన పండ్లు ఎంతో బాగా సహాయ పడతాయి. కనుక ప్రతి ఒక్కరు మీ పిల్లలకు వీటిని ఒక్కసారైనా తినిపించండి. ఈరోజుల్లో కొత్త కొత్త రోగాలు రావటానికి సగం కారణం ప్రకృతిలో సీజన్లో దొరికే పండ్ల ను వదిలేసి పిజ్జా, బర్గర్ అని ఫాస్ట్ ఫుడ్ తినడం. పిల్లల కి ఈ కొండ జాన కాయలు తినిపిస్తే దృష్టి లోపాలు పోతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.

Konda Jana Pandlu Health Benefits:-

  • కొండ జాన కాయలు తినడం వలన నోటి లోని సమస్త రోగాలు నయం అవుతాయి. జాన కాయలు నమిలి తినడం వలన దంత వ్యాధులు నయం అవ్వడంతో పాటు దంతాలు దృఢంగా, గట్టిగా తయారు అవుతాయి.నోటి దుర్వాసన తగ్గుతుంది. మన పెద్దలు , పూర్వీకులు దంతాలు దృఢంగా ఉండటానికి కారణం వారు ఈ జాన పండ్లు, ఇంకా సీజన్లలో దొరికే పండ్లను వదలకుండా తీసుకోవడమే.
  • జాన పండ్ల లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ జాన ఎంతో సహాయ పడతాయి. వర్షా కాలంలో జ్వరాలు, జలుబు, వంటి రోగలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రకృతి కూడా మనకు ఈ సీజన్లో ఇలాంటి పండ్లు, కాయలు మనకు అందిస్తుంది.
  • ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసేందుకు సహాయ పడుతుంది. రక్త ప్రసరణ మెరుగు చేస్తుంది.
  • జాన పండ్ల లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
  • అంతే కాకుండా ఇందులో మైక్రో న్యూట్రీషన్లు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
  • ఈ జాన పండ్లు మన శరీరంలో వేడిని తొలగించటానికి సహాయ పడుతుంది. మరియు ఇది శరీరానికి చలువ ని ఇస్తుంది.
  • కొండ జాన పండ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్త ప్రవాహానికి వచ్చే అడ్డంకులు తొలగిస్తాయి.
  • ఎముకలు బలంగా ఉండటానికి కొండ జాన పండ్లు ఎంతో సహాయ పడతాయి. కొండ జాన కాయల లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు, దృఢంగా తయారు చేస్తాయి.
  • ఈ సీజన్ లో వచ్చే జాన పండ్లు తినడం వలన కీళ్ల వ్యాధులు తొందరగా రాకుండా ఉంటాయి. మరియు ఈ కీళ్ల వ్యాధులు ఉన్న వారికి తగ్గడానికి సహాయ పడుతుంది.
  • జాన పండ్లు తరచూ తీసుకోవడం వలన గాయాలు త్వరగా తగ్గుతాయి. ఈ పండ్లు తీసుకోవటం వలన గాయాలు నయం చేసే శక్తి ని మన శరీరానికి అందిస్తుంది.
  • ముక్కు నుండి రక్తం కారే వారు ఈ జాన పండ్లు తీసుకోవటం వలన నయం అవుతుంది.
  • జాన పండ్లు తీసుకోవటం వలన చర్మ వ్యాధులు నయం చేయడానికి సహాయ పడుతుంది. చర్మ సౌందర్యం పెంచడానికి సహాయ పడుతుంది.
  • ఎర్ర రక్త కణాల వృద్ధి ని పెంచి రక్తాన్ని పెంచుతుంది. నరాల కు బలాన్ని ఇస్తాయి జాన కాయలు.
  • గొంతు సంబంధించిన వ్యాధులు నయం చేయడానికి సహాయ పడుతుంది.

 

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.