Banka Nakkeru

Banka Nakkeru Kayalu/Lasora Fruit Uses in Telugu:-

మన భారత దేశంలో అనేక రకాల ఆరోగ్యకరమైన పండ్లు, కాయలు ప్రకృతి మనకి అందించింది. ఈ పండ్లు మనకి ఎన్నో రకాల పోషకాలు మనకు అందిస్తుంది. ప్రకృతి సహజంగా మనకి అందించిన పండ్లలో Banka Nakkeru Kayalu లేదా Virigi Kayalu ఒకటి. విరిగి కాయలు అన్ని చోట్ల దొరుకుతాయి. ఏ విరిగి కాయలు పిచ్చి కాయలు గా చాలా మంది అనుకుంటారు. మేము చిన్న తనంలో ఉన్నపుడు ఇవి మా ఇంటి దగ్గరలో ఉండేవి. వీటిని తినేవాళ్ళం కూడా ఇవి తినడానికి కూడా భలే ఉండేవి.

Banka Nakkeru Kayala లేదా బంకరతిత్తు కాయలు చెట్టు మన భారత దేశంలో అన్ని చోట్ల కనిపించే మొక్క. Lasora చెట్టు బోరజ్ కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క.  నక్కేరు చెట్టు అనేది చిన్న సైజు నుండి మధ్యస్థ పరిమాణంలో ఆకు రాల్చే చెట్టు. Banka Nakkeru Kayala చెట్టు చిన్న బోలె. దీని కాండం బెరడు బూడిద గోధుమ రంగులో ఉంటుంది. ఈ నక్కేరు రేఖంస లేదా మృదువైన ముడతలు కలిగి ఉంటుంది. బంక నక్కేరు పువ్వులు కొమ్మకి తెలుపు రంగులో ఉంటాయి. Lasora పండ్లు పసుపు లేదా గులాబీ పసుపు రంగులో మెరిసే గ్లోబస్. ఈ Banka Nakkeru Kayalu నక్కేరు కాయలు పండినప్పుడు గుజ్జు తయారవుతుంది.

ఇవి ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి. వీటిని అనేక పేర్ల తో విరిగి చెట్టు, విరిగి కాయల చెట్టు, నక్కెర కాయల చెట్టు, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయలు చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్లు మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. వీటి పండ్లను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కాయల లోపల బంకగా తియ్యగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఈ బంక కాయలు ఇష్టంగా తింటారు. మలేసియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ మొదలైన దేశాలలో కూడా విరివిగా దొరుకుతాయి.

ఈ మొక్కల ను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. విరిగి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వేలాది సంవత్సరాలుగా వీటిని వైద్యంలో వాడుతున్నారు. ఆకులు, విత్తనాలు, బేరడులో యాంటీ బాక్టీరియా, యాంటీ ఇన్ఫలమేటరి, యాంటీ బయోటిక్ గుణాలు కలిగి ఉన్నాయి. పచ్చి కాయలు పచ్చడి గా పెట్టుకుంటారు. వీటిని డ్రై ఫ్రూట్స్ గా మెడిసిన్ గా కూడా వాడుతున్నారు.

  • కుటుంబం – బోరగినేసి
  • బైనమియల్ పేరు – cordio dichotoma
  • ఇంగ్లీష్ పేరు – Indian cherry,
  • హిందీ పేరు – Lasora  లేదా Lasoda.

బంక నక్కేరు కాయలు ఉపయోగాలు | Lasora Fruit Uses in Telugu:-

  • Banka Nakkeru పండల్లో70% పల్ప్, ఉంటుంది.
  • Nakkeru పండల్లో 100 గ్రామ్స్ కి ఆరు గ్రాముల నీరు, 35 గ్రాముల ప్రోటీన్,   55 మిల్లీ గ్రాముల కాల్షియం, 275 మిల్లీ గ్రాముల పాస్ఫరస్, 2 గ్రాముల జింక్, ఆరు మిల్లీ గ్రాముల ఐరన్, 2 గ్రాములు మాగ్నేషియం ఉంటుంది.
  • Virigi చెట్టు బెరడు లో టానిన్, గారిక్ ఆమ్లం ఉంటుంది.
  • బంక నక్కేరు కాయలు నరాల బలహీనత ని తగ్గించడానికి సహాయ పడతాయి.
  • షుగర్ ని అదుపులో ఉంచడానికి విరిగి చెట్టు ఉపయోగిస్తారు.
  • బ్రెయిన్ పవర్ పెంచడానికి విరిగి కాయలు తినవచ్చు.
  • రక్తం క్వాలిటీ ని పెంచడానికి నక్కేరు కాయలు సహాయ పడతాయి.
  • బంక నక్కేరు చెట్టు వలన ఆయాసం, గుండె దడ తగ్గుతాయి
  • వీటి వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది
  • ఈ బంక కాయలు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి.
  • కాకపోతే వీటిని మితంగా తీసుకుంటే చాలా మేలు
  • రోజుకి 10 కంటే ఎక్కువ నక్కేరు లేదా విరిగి కాయలు తీసుకోకూడదు.
  • అరుగుదల ఉన్నవారు 5 తింటే అరుగుదల శక్తి పెరుగుతుంది.
  • వీటి ఆకులు నూరి నుదిటి రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
  • Virigi Chettu బెరడు చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు.
  • బెరడు కషాయం జ్వరానికి ఉపయోగిస్తారు.
  • బంక చెట్టు బెరడు కషాయం పుక్కిలిస్తే దంత వ్యాధులు నివారించ వచ్చు.
  • నక్కేరు ఆకుల కషాయం దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
  • బంక కాయల చెట్టు ని  గ్లు బెర్రీ అని కుడా అంటారు.
  • నక్కేరు కాయల లో యాంటీ ఇన్ఫలమేటరి గుణాలు ఉన్నాయి అని IOSR జర్నల్ ఆఫ్ ఫార్మసీలో ప్రచురించిన పరిశోధనలలో తెలిపారు. ఇవి దగ్గు, ఛాతి నొప్పిని తగ్గిస్తాయి. ఈ పండు గుజ్జు తినడం వలన దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
  • నక్కేరు కాయల లో ఉండే ముసిలజినస్ లో స్టెరాల్ ఉంటుంది. ఇది దగ్గు, గొంతు నొప్పి తగ్గిస్తుంది.
  • ఈ బంక కాయల లో పండిన జిగురు, ఆకు రసం చర్మ వ్యాధులు నివారించేందుకు ఉపయోగిస్తారు. చెట్టు బెరడు పొడిని విరిగిన ఎముక ప్లాస్టర్ గా వైద్య రంగంలో ఉపయోగిస్తారు. కొన్ని పురుగు కాటు లకు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే వారు.
  • యాంటీ హైపర్ టెన్సిటి ఉండటం వలన అధిక బ్లడ్ ప్రెజర్ ని, ఒత్తిడి, ఆందోళన ని తగ్గించడానికి సహాయ పడుతుంది.
  • యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉండటం వలన బ్లడ్ షుగర్ స్ధాయి లను తగ్గించ డానికి సహాయ పడుతుంది.
  • స్టమక్ అల్సర్, జాయింట్ పయిన్స్ నివారణకు విరిగి కాయలు ఉపయోగిస్తారు.

బంక నక్కేరు కాయలు ఎలా ఉపయోగించాలి:-

  • గొంతు నొప్పి ఉంటే బంక కాయల బెరడు ఉడికించి రోజుకి 2 నుండి3 సార్లు తినవచ్చు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియా, యాంటీ విరల్ గుణాలు ఉండటం వలన గొంతు నొప్పి చికిత్స కి ఉపయోగిస్తారు.
  • చెట్టు యొక్క బెరడు కషాయం, కర్పూరం కలిపి లేపానం గా చేసి చర్మ వ్యాధులకు, మంట తగ్గించడానికి వాడతారు. దురద, పొడి చర్మం తగ్గించడానికి బంక కాయల విత్తనాలు నూరి చర్మానికి రాయడం వలన ఉపశమనం కలుగుతుంది.
  • Lasoda కాయలు ఎండబెట్టి మైదా, గోధుమ పిండి, నెయ్యి కలిపి లడ్డు లను తయారు చేస్తున్నారు. ఈ లడ్డు తినడం వల్ల శరీరానికి శక్తి, బలం లభిస్తుంది.

 

 

 

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.