Snacks With Peanuts in Telugu | Quick Evening Snacks in Telugu
హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సెనగ విత్తనాల తో స్నాక్స్ ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను. వీటిని మనం చాల ఈజీగా కేవలం రెండు పదార్ధాల తో చేస్తున్నాను. అవి ఏమిటంటే క్యారెట్ మరియు సెనగ విత్తనాలు. వీటిని సాయంత్రం టీ టైం లో టీ లేదా కాఫీ తో తీసుకుంటే చాల బాగుంటాయి. పిల్లలు, పెద్దలు ఈ పీనట్ స్నాక్స్ ని చాలా ఇష్టంగా తింటారు. ఈ పీనట్ మరియు క్యారెట్ తో స్నాక్స్ చేయడానికి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం కింద ఇవ్వబడినది.
ఇవి కూడా చదవండి:-
- Cow Health benefits in Telugu
- Balamrutham Sponge Cake in Telugu
- Money Earning Tips in Telugu in 2022
- Banka Nakkeru Kayalu
కావలసిన పదార్ధాలు (Ingredients For Snacks With Peanuts):-
- క్యారెట్లు 2
- సెనగ విత్తనాలు రెండు కప్పులు
- అల్లం
- వెల్లుల్లి
- పచ్చిమిర్చి
- జీలకర్ర
- కారం
- కరివేపాకు
- పసుపు
- ఉల్లిపాయ
- నూనె
తయారు చేయు విధానం (Procedure For Snacks With Peanuts):-
- ముందుగా ఈ రెండు కారట్లలను శుభ్రంగా కడిగి పై చెక్కు తీయండి.
- తరువాత వీటిని సన్నగా తురుముకొని పక్కన పెట్టండి.
- శనగ విత్తనాలు రెండు కప్పులు తీసుకొని వాటిని బాగా వేయించి ఆరనివ్వాలి.
- ఆ తర్వాత వేయించిన శనగ విత్తనాలు ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి.
- ఇందులో ఇపుడు చిన్న చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చి మిర్చి వేయండి.
- చివరగా రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
- మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి.
- ఇపుడు ఒక గిన్నె తీసుకొని అందులో తురిమిన రెండు కప్పుల కారట్ వేసుకోవాలి.
- ముందుగా, గ్రైండ్ చేసిన పల్లి పొడి కూడా ఈ కారట్ తురుము గిన్నె లో వేయండి.
- ఇందులో ఇపుడు పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత కారం, కరివేపాకు, చిటికెడు పసుపు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులో రెండు కప్పుల బియ్యం లేదా వరి పిండి వేసి మొత్తం బాగా కలపాలి.
- ఇపుడు కొంచెం కొంచెం వాటర్ కలిపి పిండి ముద్ద లా కలపాలి.
- ఒక పొలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసి చిన్న పిండి ముద్ద తీసుకొని చేతితో ప్రెస్ చేయండి.
- లేదా మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే దానితో కూడా ఈజీగా చెక్కలు గా చేసుకోండి.
- ఇపుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయండి.
- నూనె వేడి అయ్యాక ఈ చెక్కలను నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి.
- ఇంతే చాలా ఈజీగా సెనగ విత్తనాలు, క్యారెట్ తో స్నాక్స్ రెడీ.