Thursday, November 14, 2024
HomeSNACKSEvening Snacks in Telugu | Snacks with Potato in Telugu

Evening Snacks in Telugu | Snacks with Potato in Telugu

Evening Snacks in Telugu | Snacks with Potato in Telugu:

హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాల త్వరగా ఈజీగా చేయగలిగే స్నాక్స్ షేర్ చేస్తున్నాను. ఈ స్నాక్స్ బంగాళా దుంప మరియు ఉల్లిపాయ తో తయారు చేస్తున్నాను. ఈ స్నాక్స్ ప్రతి ఇంట్లో ఉండే పదార్ధాల తో తయారు చేస్తున్నాను. ఈ స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని సాయంత్రం టీ లేదా కాఫీ తో తీసుకుంటే చాల బాగుంటాయి. Evening snacks in Telugu with Potato ఎలా చేయాలో స్టార్ట్ చేద్దమా.

ఇవి కుడా చదవండి:-

బంగాళదుంప తో స్నాక్స్(Snacks With Potato in Telugu):

ఈ స్నాక్స్ తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం కింద ఇవ్వబడినది.

కావలసిన పదార్ధాలు (Ingredients for Potato Snacks in Telugu):-

  • 2 పచ్చిమిర్చి
  • 2 ఉల్లిపాయలు
  • 2 బంగాళా దుంపలు
  • 1/2 కప్పు శెనగ పిండి
  • పావు లీటర్ నూనె
  • 1 రెబ్బ కరివేపాకు
  • తగినంత ఉప్పు
  • 1 స్పూన్ కారం
  • 1/2 స్పూన్ ధనియాల పొడి

తయారు చేయు విధానం(Procedure for Making Snacks With Potato in Telugu):-

  • ముందుగా రెండు బంగాళా దుంపలు తీసుకోండి.
  • తర్వాత పై తొక్క తీసి శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
  • ఈ తురుము ని పది నిమిషాలు వాటర్ లో నానబెట్టి ఒకసారి లేదా రెండు సార్లు వాష్ చేయండి.
  • తర్వాత గట్టిగా పిండి వాటర్ లేకుండా ఒక గిన్నెలో వేయండి.
  • ఇలా చేయడం వలన బంగాళా దుంపల లో పిండి పదార్థంఉండదు.
  • ఆ తర్వాత ఈ ఆలు తురుము లో రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయండి.
  • మీకు స్పైసిగా కావాలంటే ఇంకొకటి వేసుకోండి.
  • సన్నగా, చిన్నగా తరిగిన కరివేపాకు, పొడవుగా సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కూడా ఇందులో వేయండి.
  • తరువాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసి బాగా కలపాలి.
  • ఉల్లిపాయ లో నుండి వాటర్ బయటకు వచ్చేట్లు కలపాలి.
  • ఆ తరువాత ఇందులో అర కప్పు శనగ పిండి వేసి కలపాలి.
  • ఇందులో మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే దీనిని బాగా కలిపితే ఉల్లిపాయ ముక్కల లో నుండి వచ్చే వాటర్, బంగాళదుంప తురుము లో ఉండే తేమ సరిపోతాయి.
  • ఇవన్నీ బాగా కలిపి అయిదు నిమిషాలు పక్కన పెట్టండి.
  • తరువాత ఇవి కలిపితే బాల్స్ లాగా వస్తే సరే.
  • లేదంటే ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ కలపవచ్చు.
  • అంతే కాని ఎక్కువ వాటర్ కలపవద్దు.
  • తరువాత ఒక కడాయి తీసికొని అందులో నూనె వేసి వేడి చేయండి.
  • నూనె వేడి అయ్యాక ఈ పిండి ని చిన్న ముద్దలు గా చేసి డీప్ ఫ్రై చేయండి.
  • గోల్డెన్ బ్రోన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి.

పొటాటో స్నాక్స్ వీడియో కింద ఇవ్వబడినది.

RELATED ARTICLES

Most Popular